బాబూ మేము పార్టీలో ఉండాలా బయటకు పోవాలా?కొత్త జడ్పీటీసీల ప్రశ్న .. !

గ్ర‌హ‌చారం బాగా లేక‌పోతే.. ఏం చేసినా క‌లిసి రాద‌న్న‌ది టీడీపీ అధినేత చంద్ర‌బాబు విష‌యంలో నిజ‌మ‌వుతోంది. ఆయ‌న‌కు వైసీపీ నేత‌ల నుంచే కాదు.. సొంత పార్టీ శ్రేణుల నుంచే సెగ త‌గులుతోంది. ఇటీవ‌ల గెలిచిన ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు మా ప‌రిస్ఙితేంటి.. ఉండ‌మంటారా, పొమ్మంటారా.. అనే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అటు టీడీపీ నాయ‌కులూ ప‌ట్టించుకోక‌, ఇటు వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేక‌.. అధిష్ఠానం సూచ‌న‌లు ఇవ్వ‌క వారిలో అస‌హ‌నం పెరుగుతోంది. పరిషత్ ఎన్నికలకు ముందు చాలా మంది నాయకులకు.. కాన్ఫిడెన్స్ ఉండేది. మనం పోటీ చేశాం.. సో.. గెలుస్తాం.. ఇబ్బంది లేదు.. అనుకున్నారు.

చంద్ర‌బాబు పైకి ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ నాట‌కం అడినా.. అప్ప‌టికే బీ ఫారాలు అంద‌జేయ‌డంతో చాలా మంది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. సుమారు ఏడు వంద‌ల ఎంపీటీసీ స్థానాలను, అన్నో కొన్నో జడ్పీటీసీ స్థానాలను ఆ పార్టీ అభ్య‌ర్థులు ద‌క్కించుకున్నారు. ఇప్పుడు వీరంతా సంక‌ట స్థితిలో ప‌డ్డారు. ఎవరి తరఫున ఆయా మండల పరిషత్లో మాట్లాడాలి, అదేవిధంగా.. చంద్రబాబు చెబుతున్నట్టు.. మేం ఎన్నికలు బహిష్కరించాం.. అంటే.. మరి గెలిచిన వీరంతా రెబల్స్ అనుకోవాలా, పార్టీ వీరిని సస్పెండ్ చేస్తుందా అనే ప్రశ్నలు బాబు చుట్టూ హల్చల్ చేస్తున్నాయి.

Also Read : జేసీ దివాకర్‌ రెడ్డి లేటెస్ట్‌.. ఇక అక్కడ నుంచి రాజకీయం

ఇంకో విష‌యం ఏంటంటే.. ఇవన్నీ ఎవరో.. వైసీపీ నాయకులో అడిగిన ప్రశ్నలు కావు.. టీడీపీ ప్రధాన సోషల్ వింగ్లోనే పోస్టవుతున్న ప్రశ్నలు. మరో కీలక ప్రశ్న ఏంటంటే.. నామినేషన్ల విషయంలో చంద్రబాబు అనుసరించిన తీరు. బీఫారాలు ఇచ్చిన తర్వాత.. నామినేషన్లు వేసిన తర్వాత బహిష్కరణ ప్రకటన చేశారు. మరి అప్పుడైనా.. ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారా ? అనేది.. మరో ప్రశ్న.

ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే.. ఎంపీపీ, జడ్పీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో.. ఈ సమయంలో టీడీపీ నుంచి గెలిచిన వారు ఎలా వ్యవహరించాలి? అనేది చర్చగా మారింది. పార్టీ తరఫున ఇప్పటి వరకు వీరిని అభినందించిన వారు లేరు. ఎంతో కష్టపడి.. టీడీపీ అధినేత చెప్పినట్టు.. వైసీపీ దూకుడును సైతం తట్టుకుని పోటీ లో నిలిచి.. సైకిల్ ను పరుగులు పెట్టించారనే సానుభూతి ప్ర‌జ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ, ఇప్పటి వరకు పార్టీ నేత‌లు వీరిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ నేపథ్యంలో.. టీడీపీలోనే ఉండాలా ? లేక.. వైసీపీలోకి జంప్ చేయాలా ? అనే ప్రశ్న.. పలువురి నుంచి వినిపిస్తోంది.

ఎందుకంటే. పార్టీ నుంచి ఆదరణ లేనప్పుడు.. తమను రెబ‌ల్స్ లా చూస్తున్నప్పుడు.. పార్టీ తరఫున వచ్చే ఐదేళ్లపాటు.. వైసీపీతో ఎందుకు పోరాడాలనేది.. కొందరి భావనగా ఉంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ.. అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అయితే.. ఆయన వెనక్కి తగ్గలేని పరిస్థితి నెలకొంది. తన పార్టీ తరఫున విజయం సాధించిన వారిని అభినందించలేని పరిస్థితిని బాబు స్వయంగా తెచ్చుకున్నారని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

Also Read : రాజకీయాలకు కేశినేని గుడ్ బై .. వారసురాలి రంగ ప్రవేశం?

Show comments