Ap police – నెంబ‌ర్ 1 : ఏపీ పోలీస్.. స్మార్ట్ పోలీస్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు అన్నింటా గుర్తింపు పొందుతున్నారు. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో కూడా ప‌లు ప్రశంసలు, అవార్డులు పొందారు. టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా జవాబుదారితనంతో త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు మరో ఘనత దక్కింది. స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌గా ఎంపికైంది.

స్మార్ట్ పోలీసింగ్‌పై దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌లో  స‌ర్వే నిర్వహించింది ఇండియ‌న్ పోలీస్ ఫౌండేష‌న్. ఈ ర్యాంకింగ్‌లో ఏపీకి అగ్రస్థానం లభించగా తెలంగాణకు సెకెండ్ ప్లేస్ లభించింది. 2014 డీజీపీల స‌మ్మేళ‌నంలో స్మార్ట్ పోలీసింగ్ ప‌ద్దతుల‌ను పాటించాల‌ని ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.

ప్రధాని పిలుపుకు స్పందించి స్మార్ట్ పోలీసింగ్ నిర్వహిస్తున్న రాష్ట్రాల‌లో ఇండియ‌న్ పోలీస్ ఫౌండేష‌న్ (ఐపీఎఫ్‌) స‌ర్వే చేసింది. ప్రజ‌ల ప‌ట్ల పోలీసులు వ్యవ‌హ‌రిస్తున్న తీరుపై స‌ర్వే నిర్వహించింది ఐపీఎఫ్‌. ఫ్రెండ్లీ పోలీసింగ్‌, నిష్పక్షపాత‌, చ‌ట్టబద్ధ, పార‌ద‌ర్శక పోలీసింగ్‌, జ‌వాబుదారీత‌నం, ప్రజ‌ల న‌మ్మకం విభాగాల్లో ఏపీ నెంబ‌ర్ వ‌న్, రెండో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.

పోలీస్ సెన్సిటివిటి, పోలీసుల ప్రవ‌ర్తన‌, అందుబాటులో పోలీసు వ్యవ‌స్థ, పోలీసుల స్పంద‌న, టెక్నాల‌జీ ఉప‌యోగం విభాగాల్లో తెలంగాణ‌కు మొద‌టి స్థానం దక్కించుకుంది. ఏపీకి రెండో స్థానం లభించింది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ సేవ‌ల‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కుతోంది. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇప్పుడు మ‌రోసారి ఏపీ పోలీస్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో 5 అవార్డులు లభించాయి. దాంతో ఏపీ పోలీసులకు ఈ రెండేళ్ల కాలంలో లభించిన అవార్డుల సంఖ్య 130కి దాటిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. తాజాగా లభించిన ఐదు అవార్డులు టెక్నాలజీ వినియోగం అంశంలో ల‌భించాయి.

Also Read : Tdp,Peethala Sujatha – అప్పుడెందుకు మాట్లాడలేదు సుజాత గారూ..?

ఈ రోజు ఏపీ పోలీసులు గర్వించదగ్గ రోజని పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఏపీ పోలీసు శాఖలోని సిబ్బంది ఆరోగ్య సమాచారమంతా పొందుపరచామని దీనికి కూడా అవార్డు దక్కిందన్నారు. కృత్రిమ మేధ పాస్ పోర్ట్ వెరిఫికేషన్ పోలీసు సిబ్బంది డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నిర్వహణ తదితర అంశాల్లో ఏపీ పోలీసు విధానాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర పోలీసుల పనితీరు సర్వత్రా ప్రశంసలు అందుకుందని అన్నారు. తాజా పురస్కారాలతో రాష్ట్ర పోలీసులపై మరింత బాధ్యత పెరిగిందని డీజీపీ తెలిపారు.

గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 130 అవార్డులు ఏపీ పోలీస్ శాఖకి దక్కాయయని ఈ అవార్డులు పోలీస్ శాఖపై మరింత బాద్యత పెంచాయని పేర్కొన్నారు. అవార్డులు పెరుగుతున్న కొద్దీ శాఖ పనితీరుని మరింతగా మెరుగుపరుచుకుంటున్నామన్నారు. కరోనా సమయంలో ఏపీ పోలీస్ పనితీరు ప్రశంసలు అందుకుందని చెప్పారు. దిశ యాప్ మహిళల రక్షణపై ఏపీ పోలీసు శాఖకి ఇప్పటివరకు 17 అవార్డులు వచ్చాయి. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ దిశ యాప్ ప్రారంభించిన తర్వాత నుంచి రాష్ట్రంలో 4666841 మంది ఇప్పటి వరకు ఈ యాప్ డౌన్ లోడ్ చేశారు.

దిశ యాప్ తో మహిళలకి దైర్యం వచ్చింది. దిశ యాప్తో అన్ని విధాల రక్షణ లబిస్తుందని మహిళలు భావిస్తున్నారు. రోజుకి 4 వేల వరకు కాల్స్ వస్తున్నాయి. దిశ యాప్ ఒక్కదానికే గతంలో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి.పోలీస్ సేవా యాప్ను ఇప్పటి వరకు 7 లక్షల పైన డౌన్లోడ్ చేసుకున్నారు. పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తున్నాం. పోలీస్ శాఖలో పారదర్శకతకి ఈ పోలీస్ సేవా యాప్ ద్వారా పెద్ద పీట వేస్తున్నాం. ప్రతీ సోమవారం అన్నిజిల్లాల ఎస్పీ కార్యాలయాలలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా జవాబుదారితనంతో త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నాం. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందించారు.

Also Read : CM Jagan -నా స్పీచ్ చంద్రబాబు చూడాలి, చూస్తారు: జగన్

Show comments