Idream media
Idream media
ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ యుగం వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో డిజిటల్ ఇండియా కోసం ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రచారానికి దేశ ప్రజలు ఎంత స్ఫూర్తి పొందారో చెప్పలేం కానీ.. బీహార్‌కు చెందిన ఓ బిచ్చగాడు మాత్రం చాలా ప్రభావితం అయ్యాడు.
తనకు ధర్మం చేసేవాళ్ల నుంచి డిజిటల్ పేమెంట్స్ స్వీకరించడం మొదలుపెట్టాడు. ఇందుకోసం తన మెడకు ఓ క్యూఆర్ కోడ్‌ను తగిలించుకోవడమే కాకుండా ఓ ట్యాబ్లెట్ కూడా అందుబాటులో ఉంచుకున్నాడు.
ఈ-వ్యాలెట్ ట్రెండ్‌ను అందిపుచ్చుకున్న ఈ డిజిటల్ బిచ్చగాడి పేరు రాజు పటేల్(40). బీహార్‌లోని బెట్టియా రైల్వేస్టేషన్‌కు వచ్చిపోయే ప్రయాణికుల నుంచి బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తుంటాడు.. ఫోన్‌పే లాంటివి రావడంతో జేబులో నగదు లేదని, చిల్లర లేవని చాలా మంది ప్రయాణీకులు తనకు ధర్మం చెయ్యకుండా వెళ్లిపోవడంతో రాజు డిజిటల్ పేమెంట్స్‌పై దృష్టిపెట్టాడు.
వెంటనే బ్యాంక్ ఖాతా తీసుకుని దానికి అనుసంధానంగా ఈ-వ్యాలెట్ తెరిచేశాడు. బ్యాంక్ ఖాతా కోసం పాన్ కార్డు కూడా తీసుకున్నాడు. ఇక, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అభిమాని అయిన ఈ డిజిటల్ బిచ్చగాడు.. ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసంగాలను రేడియో ద్వారా క్రమం తప్పకుండా వింటాడట..!!
Also Read : ‘కొంప’కు ఎసరు తెచ్చిన మోడీ హామీ.. ఖాతాలో రూ.15 లక్షలు పడడంతో ఇంటి నిర్మాణం.. కానీ?