Idream media
Idream media
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ప్రజలకు అందిన టెలీ మెడిసిన్ సేవలు.. మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. మునుపటికన్నా నాణ్యమైన సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందబోతున్నాయి. ఈ టెలీ మెడిసిన్‌ను గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్-AIIMS) ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ నేపథ్యంలో ఆస్పత్రికి రానవసరంలేకుండా ప్రజలకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో టెలీ మెడిసిన్ సేవలకు ఎయిమ్స్ శ్రీకారం చుట్టింది.
జనరల్ మెడిసిన్‌తోపాటు టెలీ మెడిసిన్ ద్వారా అందించగలిగిన అన్ని రకాల సేవలను శనివారం నుంచి ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. విభాగాల వారీగా అందించే సేవల వివరాలు, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను వెల్లడించింది. 94939065718, 8523007940 ఫోన్ నంబర్లలో ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వైద్యసేవలను పొందవచ్చు.
విభాగాలు – ఫోన్ నంబర్లు
సామాజిక కుటుంబ వైద్య విభాగం ఫోన్ నంబర్ 9494908320
చెవి ముక్కు, గొంతు విభాగం 9494906407
జనరల్ మెడిసిన్ – 9494908526
జనరల్ సర్జరీ – 9494901428
ప్రసూతి స్త్రీల విభాగం – 9494907302
చిన్న పిల్లల విభాగం – 9494902674
దంత వైద్య విభాగం – 9494907082
నేత్ర వైద్య విభాగం – 9494905811
చర్మవ్యాధుల విభాగం – 9494908401
మానసిక వైద్య విభాగం – 9494730332
Also Read : YSR Pashu Sanjeevani – జగన్ దూకుడు.. ఏపీలో మరో కొత్త పథకం