అందమైన భార్య.. డబ్బు కోసం భర్త కక్కుర్తి పని! ఆమెని అడ్డం పెట్టి!

Chitradurga Crime News: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో బెట్టింగ్ లకు పాల్పపడుతున్నారు. దురదృష్టం వెంటాడి లక్షల్లో అప్పుల పాలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

Chitradurga Crime News: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో బెట్టింగ్ లకు పాల్పపడుతున్నారు. దురదృష్టం వెంటాడి లక్షల్లో అప్పుల పాలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

క్రికెట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఆట ఎంజాయ్ చేసేవారు కొందరు ఉంటే.. దాన్ని క్యాష్ చేసుకునే వాళ్లు మరికొందరు ఉన్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్ ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కోట్లలో డబ్బులు ట్రాన్‌జక్షన్ అవుతుంటాయి. వేల కోట్ల బెట్టింగ్ నడుస్తుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు బెట్టింగ్ మాయలో పడి వేలు, లక్షలు, కోట్లు పోగొట్టుకుంటారు. అదృష్టం ఉన్నవాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. ఓ వ్యక్తి బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకొని భార్య మృతికి కారణం అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

భర్త ఇంజనీర్.. తాను కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఆ కలలు కల్లలుగానే మిగిలాయి.. భర్త చేసిన పొరపాటు భార్య పాలిట శాపంగా మారింది. జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్యకు పాల్పపడింది. ఈ దారుణ ఘటన చిత్రదుర్గ జిల్లా హోల్‌కెరె నగర్‌లో చోటు చేసుకుంది. దర్శన్ అనే ఇంజనీర్ హుసదుర్గలోని చిన్న నీటి పారుదలశాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రంజితను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన రెండేళ్లు ఈ జంట హ్యాపీగా ఉన్నారు. ఈ జంటకు ఓ బాబు ఉన్నాడు. ఇటీవల దర్శన్ బెట్టింగ్ లకు పాల్పపడుతూ లక్షలు పోగొట్టుకున్నాడు. డబ్బు కోసం బెట్టింగ్ డీలర్ల వద్ద బ్లాంక్ చెక్ లు పెట్టి లక్షల అప్పు తీసుకున్నాడు.

క్రికెట్ బెట్టింగ్ లో దర్శన్ 2021 నుంచి దాదాపు 54 లక్షల వరకు అప్పు తీసుకొని చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. తన అందమైన భార్యను అప్పుల వాళ్ల ముందు ఉంచి ప్రతిసారి ఏవో కుంటిసాకులు చెబుతూ వచ్చాడు.  దర్శన్ కి తన భార్యను అడ్డు పెట్టుకొని రుణదాత నుంచి తప్పించుకోవడం అలవాటైంది. మరోవైపు అప్పుల వాళ్లకు రంజిత సమాధానం చెబుతూ వచ్చింది. కొంత కాలం తర్వాత ఆమె మాటలు నమ్మకుండా అప్పులు వాళ్లు సీరియస్ అయ్యారు. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి రుణం త్వరలో తీరుస్తానని ఒప్పుకున్నాడు. కానీ టైమ్ దాటినా అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో అప్పుల వాళ్లు ఈ జంటను దయ్యాల్లా పీడించారు. పదే పదే ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరించారు. ఇంటికి వచ్చి పరువు తీస్తూ నానా యాగీ చేశారు.

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక రంజిత తన గదిలో ఆత్మహత్యకు పాల్పపడింది. కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే రంజిత తండ్రి వెకటేష్ హుళల్ కేరె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా హోళల్‌కెరెకు చెందిన పలువురు తమ కూతురిని దారుణంగా వేధించారని.. మనస్థాపానికి గురైన తన కూతురు బలవన్మరానానికి పాలప్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. క్రికెట్ బెట్టింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Show comments