Success Story: యువ రైతు అద్భుతం! ఉద్యోగం వదిలేసి.. వ్యవసాయంతో కోటీశ్వరుడయ్యాడు!

జీవితంలో తమకు నచ్చిన పని చేయడం మానేసి.. జీతం కోసం మాత్రమే పని చేసేవారు ఎక్కువగా ఉన్నారు.. కానీ కొందరు మాత్రం లగ్జరీ జీవితాలకు గుడ్ బై చెప్పి.. తమకు నచ్చిన పనులను చేస్తూ సక్సెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సక్సెస్ స్టోరీ కూడా అటువంటిదే.

జీవితంలో తమకు నచ్చిన పని చేయడం మానేసి.. జీతం కోసం మాత్రమే పని చేసేవారు ఎక్కువగా ఉన్నారు.. కానీ కొందరు మాత్రం లగ్జరీ జీవితాలకు గుడ్ బై చెప్పి.. తమకు నచ్చిన పనులను చేస్తూ సక్సెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సక్సెస్ స్టోరీ కూడా అటువంటిదే.

ఇప్పుడు మన చుట్టూ ఉద్యోగాలు చేసే చాలా మంది.. వారు కన్న కలలు ఒకటైతే బ్రతికే జీవితం మరొకటి. జీతం కోసం ఎదురుచూస్తూ జీవితాలను గడిపేస్తున్నారు. దాని వెనుక ఉండే కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ, వారికీ మాత్రం ఎక్కడో ఒక దగ్గర మనం కోరుకున్న జీవితం ఇది కాదు కదా అనే భావన వెంటాడుతూనే ఉంటుంది. కానీ, ఇవన్నీ నిన్న మొన్నటి కథలు. ఇప్పుడు యువత వీటిన్నంటిని బ్రేక్ చేస్తూ.. తాము అనుకున్న లక్ష్యాల దిశగా అడుగులు వేస్తు కొత్త విప్లవాలను తీసుకుని వస్తున్నారు. సరికొత్తగా పురాతన సంస్కృతి సంప్రదాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరెంకల ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. లగ్జరీ జీవితాలకు వీడ్కోలు పలుకుతూ.. సరికొత్త పద్దతిలో వ్యవసాయాన్ని చేస్తూ.. విజయం సాధిస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి వారిని ఎంతోమందిని చూసి ఉంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువ రైతు స్టోరీ కూడా ఇటువంటిదే. మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేయాలనీ నిర్ణయించుకున్న ఈ రైతు ఎవరో ఏంటో తెలుసుకుందాం.

ఈ రైతు హర్యానాకు చెందిన ఒక యువకుడు. ఇతని పేరు రాజీవ్ భాస్కర్. మంచి ఉద్యోగం విలాసవంతమైన జీవితం. కానీ, ఇతను వాటి అన్నిటిని వదులుకుని వ్యవసాయం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. 2017లో ఈ నిర్ణయాన్ని తీసుకుని.. వ్యవసాయంలో కొత్త రకం పద్దతులను అనుసరించి.. జామ పండ్లను సాగు చేయడం ప్రారంభించాడు. మొదట ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని జామ పండ్లను సాగు చేశాడు. అప్పుడు అతనికి కొన్ని లక్షల రూపాయలలో లాభం వచ్చింది. అయితే, ఇతను సేంద్రియ పద్దతిలో జామ పంటను సాగు చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందగలిగాడు. క్రమంగా ఇతను ఒక సంవత్సరానికి రూ.20 లక్షల లాభం పొందాడు. ఆ తర్వాత అతను థాయ్ రకం జామ పండ్లను పండించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం పంజాబ్‌లోని రూపనగర్‌లో 55 ఎకరాల భూమిని అద్దెకు తీసుకున్నాడు.

ఇక దానిలో ఇరవై ఐదు ఎకరాల్లో థాయ్ జామ పంటను వేశాడు. దీనితో రాజీవ్ భాస్కర్ కు ఊహించని లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎంతోమందికి ఈ రైతు ఉపాధి కలిగిస్తున్నాడు. అలాగే కోట్లాది రూపాయలలో లాభం పొందుతున్నాడు. ఆ ప్రాంతంలో ఒక సక్సెస్ ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఇతను మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇందులో ఇతని ప్రత్యేకత ఏంటంటే.. జామ తోటలను అద్దెకు తీసుకుని వాటిని సాగు చేసి.. కోట్ల రూపాయల ఆదాయం పొందడం ఇతని ప్రత్యేకత. ఇతను పూర్తిగా సేంద్రియ పద్దతిలోనే ఎరువులను వాడుతూ.. పంటను సాగు చేశాడు. ఈ పద్దతిని అనుసరించడం ద్వారా.. ఎకరానికి ఆరు లక్షల వరకు లాభం పొందవచ్చని అతను తెలియజేశాడు. ప్రస్తుతం ఇతని పంట లాభాల బాటలో కొనసాగుతుంది. ఇతను ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments