Arjun Suravaram
నేటికాలంలో ఎంతో మంది దొంగబాబాలు పుట్టుకొస్తున్నారు. తరచూ దొంగబాబాలకు సంబంధించిన అనేక ఘోరాలు బయటకు వస్తుంటాయి. 100 మంది మహిళలను పాడు చేసిన ఓ దొంగబాబా దారుణంగా మృతి చెందాడు.
నేటికాలంలో ఎంతో మంది దొంగబాబాలు పుట్టుకొస్తున్నారు. తరచూ దొంగబాబాలకు సంబంధించిన అనేక ఘోరాలు బయటకు వస్తుంటాయి. 100 మంది మహిళలను పాడు చేసిన ఓ దొంగబాబా దారుణంగా మృతి చెందాడు.
Arjun Suravaram
నేటి ఆధునిక యుగంలో అందరు యంత్రాల్లా పని చేస్తున్నారు. ఇలాంటి జనాల్లో మధ్యలో కూడా ఆధ్యాత్మిక భావంతో నడిచివారు కొందరు ఉన్నారు. వారు నీటిలో తామర పువ్వుల్లా.. సమాజంలో ఉంటూనే ఆధ్యాత్మికం వైపు తమ జీవనాన్ని సాగిస్తుంటారు. వారిని చూసి..మరికొందరు అటుగా సన్మామార్గం వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొందరు దొంగబాబాల కారణంగా… అపకీర్తి, అపనమ్మకం అనేది వస్తుంది. ఇప్పటికే ఎంతో మంది దొంగ బాబాలు..తమ మాయమాటలతో మహిళలను లోబర్చుకున్నారు. అలానే జిలేబి బాబా అనే ఓ దొంగ బాబా కూడా 100 మంది మహిళలను రే*ప్ చేశాడు. చివరకు గురువారం మృతి చెందాడు. మరి.. అసలు ఈ జిలేబి బాబా స్టోరీ ఏమిటో ఇప్పుడూ చూద్దాం…
హర్యానా ప్రాంతాన్నికి చెందిన అమర్ పురి అనే 2017లో జిబేబీని అమ్ముకుంటూ జీవనం సాగించాడు. ఆ తరువాత తన మాయమాటలతో అందరిని ఆకట్టుకునే వాడు. చివరకు జిలేబి బాబాగా అవతారం ఎంతాడు. అమర్ పురి కాస్తా జిలేబి బాబాగా మారాడు. తనని తాను బాబాగా ప్రకటించుకుని జనాలను పిచ్చోళ్లను చేశాడు. ముఖ్యంగా మహిళలను తన వ్యాఖ్యలతో ప్రభావితం చేసి తన మాయలో పడేసుకునే వాడు. అలా ఆ దొంగ బాబా మాటలు నమ్మి.. చాలా మంది విరాళలు ఇచ్చారు. మరికొందరు డబ్బులను సేకరించి..ఓ ఆశ్రమాన్ని కూడా కట్టించారు.
ఇక అక్కడి నుంచి ఈ జిలేబీ బాబా ఆటలు శృతి మించాయి. ఆ ఆశ్రమానికి ఎక్కువగా ఆడవాళ్లు వచ్చి వెళ్లేవారు. అలా తన వద్దకు వచ్చిన మహిళలతో లైం*గిక వాంఛలు తీర్చుకునే వాడు. అంతేకాక వారితో చేసిన శృ0గారానికి సంబంధించిన దృశ్యాలను కెమెరాల్లో రికార్డ్ చేసే వాడు. తన విషయం బయటకు చెప్తే.. ఆ వీడియోలను లీక్ చేస్తానని బెదిరించేవాడు. దీంతో చాలా మంది మహిళలు పరువు కోసం భయపడి సైలెంట్ గా ఉన్నారు. మరికొందరు మాత్రం ధైర్యం చేసి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిలేబి బాబా రంగు బయటపడింది. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. జిలేబి ఆశ్రమానికి వచ్చిన మహిళలకు టీ, పానీయాలు మత్తు మందు కలిపి ఇచ్చే వారంట. వారు మత్తులోకి జారుకున్న తరువాత తన లైం*గిక వాంఛను తీర్చుకునే వాడని వెల్లడైంది. ఆశ్రమంలో ఉన్న మగవారంతా కూడా మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు తీసేవారు. ఆ వీడియోలన్నీ పోలీసులకు దొరకడంతో ఈ దొంగబాబాను అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా ఈ కేసుపై విచారణ సాగింది. చివరకు అతడు దోషిగా తేలడంతో కోర్టు ఇతనికి 14 ఏళ్లు శిక్ష విధించింది. ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న ఆయన నిన్న జైల్లో మృతిచెందాడు. నిన్న రాత్రి గుండెపోటుతో జిలేబీ బాబా మరణించినట్లు తెలుస్తోంది. ఈఘటనపై బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు తగిన శాస్తి చేశారని అభిప్రాయా పడుతున్నారు.