అయోధ్య రాముడికి క్షమాపణలు చెప్పిన మోదీ! ప్రాణ ప్రతిష్ట తర్వాత ఎమోషనల్‌ స్పీచ్‌!

Narendra Modi Speech At Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మనం త్రేతాయుగంలో ఉన్నామా? అని సందేహం వచ్చేలా ఈ వేడుక సాగింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అయోధ్య రామయ్యకు క్షమాపలు చెప్పారు.

Narendra Modi Speech At Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మనం త్రేతాయుగంలో ఉన్నామా? అని సందేహం వచ్చేలా ఈ వేడుక సాగింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అయోధ్య రామయ్యకు క్షమాపలు చెప్పారు.

కొన్ని వందల సంవత్సరాల, కొన్ని కోట్ల మంది హిందువుల కల నేడు సాకారం అయ్యింది. త్రేతాయుగంలో 14 ఏళ్ల పాటు వనవాసం ఉన్న రామచంద్రుడు, కలియుగంలో కొన్ని వందల ఏళ్లు వనవాసం ఉన్నాడు. అయితే కొన్ని వందల మంది పోరాటల, కృషి ఫలితంగా నేడు రామయ్య అయోధ్యలోని తన మందిరంలోకి వచ్చాడు. అయోధ్యలో బాలరాముడిని ప్రాణ ప్రతిష్ట వేడుక ఘనంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ రామయ్య ప్రాణప్రతిష్ట వేడుక జరిగింది. అంతేకాక తొలిపూజను కూడా ఆయన చేతుల మీదుగానే స్వామివారికి జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది అతిరథ మహారథులు విచ్చేసి.. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  శ్రీరాముడికి క్షమాపలు చెప్పారు. అందుకు కారణం ఏమిటి?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

సోమవారం యావత్ భారతదేశం అయోధ్యలోని రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుకను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రాణ ప్రతిష్ట జరిగేది అయోధ్యలోనే అయినా.. ఆ వేడుక వాతావరణం మాత్రం దేశంలోని ప్రతి ఒక్క దేవాలయంలో.. ప్రతి ఒక్కరి ఇంట్లో నెలకొంది. ఇక రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ భావోద్వేగ భరితమైన స్పీచ్ ఇచ్చారు. రామయ్య మందిరం ఆలస్యమైనందుకు మోదీ క్షమాపణలు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ..జై శ్రీరామచంద్రమూర్తికి  జై అంటూ మోదీ  ప్రసంగాన్ని ప్రారంభించారు. రామ భక్తులందరికీ తన ప్రణామాలు తెలియజేశారు.

ఈరోజు మన రాముడు వచ్చేశాడని ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడు అయోధ్య మందిరంలోకి వచ్చేశారని ఆయన తెలిపారు. అంతేకాక ఈ మధురమైన క్షణాలు ఎంతో ప్రత్యేకమైనవని, ఇది  సామాన్యమైనది కాదని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఎంతోచెప్పాలని ఉన్నా.. తన గొంతు గద్దదంగా ఉందని అన్నారు. మన రాముడు టెంట్ లో ఉండే పరిస్థితులు ఇక లేవు. ఇక నుంచి మన రాముడు ఇకపై దివ్యమైన మందిరంలో ఉంటారని చెప్పారు. జనవరి 22 అనేది ఒక కొత్త కాలచక్రానికి ప్రారంభమైందని, ఈ రోజు మనకు శ్రీరాముడి మందిరం దొరికిందని ఆయన తెలిపారు. బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భవించిందని మోదీ తెలిపారు.

ఇక అయోధ్య రామమందిర నిర్మాణం ఇంత ఆలస్యంగా జరిగినందుకు మమ్మల్ని క్షమించమని ఆ శ్రీరాముడిని వేడుకుంటున్నానని మోదీ తెలిపారు. త్రేతాయుగంలో శ్రీరాముడు అయోధ్యను వదిలి కేవలం 14 ఏళ్లు మాత్రమే వనవాసానికి వెళ్లారు. కానీ కలియుగంలో మాత్రం వందల యేళ్ల పాటు వనవాసం చేశాడని మోదీ అన్నారు.  భారత న్యాయవ్యవస్థకు ఈ రోజు తాను నమష్కరిస్తున్నానని, శ్రీరాముడి ఆలయ నిర్మాణం న్యాయబద్దంగానే జరిగిందన్నారు. ఇక శ్రీరాముడు ఒక వివాదం కాదు.. సమాధానమని చెప్పాడు. ఇక రామ మందిరాన్ని వ్యతిరేకించిన వారిని కూడా ఈ వేడుకకు ఆహ్వానించామని, రాబోయే వెయ్యేళ్ల కోసం పునాది రాయి వేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇది విజయ క్షణమే కాదు.. విన్రమ క్షణం కూడ. రాముడు అందరివాడు. త్రేతాయుగంలో రామడుు వచ్చాకే వేలయేళ్ల పాటు ఈ దేశం ప్రపంచాన్ని శాసించింది. అలానే రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురు చూపులు ఫలించాయి. సేవా, చింతన, భక్తిని హనుమాన్ నుంచి ప్రేరణ పొందాలి. అలానే ఎవరైన బలహీనులం అని భావించే వారు.. ఉడతను చూసి ప్రేరణ పొందాలి. దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇదే మన నినాదం” అంటూ మోదీ ప్రసంగించారు. మరి.. రామయ్యకు మోదీ క్షమాపణలు తెలుపుతూ చేసిన ఉద్వేగ ప్రసంగంపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments