బిర్యానీ, ఉద్యోగం కోసం ఆత్మహత్య మానుకున్నాడు!

తీవ్ర మానసిక ఒత్తిడికి గురైయిన ఓ వ్యక్తి ఉన్నటుండి చేసిన నిర్వహకం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి వరకు తన కూతురితో మంచిగా గడిపిన అతడు ఇంతలోనే ఏం జరిగిందో ఏమోగాని ఊహించని సంఘటనతో అందరినీ ఉలిక్కిపడేలా చేశాడు. అతడి చేసిన పనికి పోలీసులు అడ్డుకునే సన్నివేశం చూస్తే ఆశ్చర్యం గురవుతారు. అసలు ఏం జరిగిదంటే..

తీవ్ర మానసిక ఒత్తిడికి గురైయిన ఓ వ్యక్తి ఉన్నటుండి చేసిన నిర్వహకం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి వరకు తన కూతురితో మంచిగా గడిపిన అతడు ఇంతలోనే ఏం జరిగిందో ఏమోగాని ఊహించని సంఘటనతో అందరినీ ఉలిక్కిపడేలా చేశాడు. అతడి చేసిన పనికి పోలీసులు అడ్డుకునే సన్నివేశం చూస్తే ఆశ్చర్యం గురవుతారు. అసలు ఏం జరిగిదంటే..

దేశంలో నిత్యం ఏదో ఒక వింత సంఘటనలు విడ్డురాలు అనేవి జరుగుతునే ఉంటాయి. అందులో సోషల్ మీడియా వాడకం అందుబాటులోకి రావడంతో ప్రతి నిమిషం ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలోనే కొందరు పాపులార్ అవ్వలని, మరి కొందరు తమ ఆర్థిక సమస్యలపై న్యాయం జరగాలని ప్రాణలతో చెలగాటమాడుతారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన నిర్వహకం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ సమస్యలతో ఆ వ్యక్తి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అప్పటి వరకు తన కూతురితో మంచిగా గడిపిన అతడు ఇంతలోనే ఏం జరిగిందో ఏమోగాని ఊహించని సంఘటనతో అందరినీ షాక్ గురైయ్యేలా చేశాడు. అతడి చేసిన పనికి పోలీసులు అడ్డుకునే సన్నివేశం చూస్తే.. ఇంట్లో చిన్న పిల్లలు స్కూల్ కి వేళ్లడానికి మారం చేస్తే చాక్లెట్ కొని ఇచ్చిన మాదిరిగా ఉంటుంది. ఇంతకి ఏం జరిగిదంటే..

కోల్‌కతా లోని స్థానికంగా నివాసం ఉండే ఓ 40 ఏళ్ల వ్యక్తి ఉన్నటుండి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ వంతెనపై ఎక్కాడు. ఈ విచిత్రమైన సంఘటన వలన నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వీధుల్లో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోవడం తీవ్ర ప్రభావితం చేసిందని కారయా స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో జరిగింది. ఆ సమయంలో అతడు తన పెద్ద కుమార్తెను తన ద్విచక్ర వాహనంపై సైన్స్ సిటీకి తీసుకువెళుతున్నాడు. ఇంతలోనే ఏం బుద్ధి పుట్టిందో కానీ, అకస్మాత్తుగా వంతెన దగ్గర తన ద్విచక్ర వాహనం ఆపాడు. కాగా, తన కూతురితో మొబైల్ ఫోన్ ఎక్కడో రోడ్డుపై పడిపోయిందని, దానిని వెతుకుతనని చెప్పాడు. దీంతో ఆమెను రొడ్డు పై నిలబెట్టాడు. అనంతరం అతడు రహదారి కి దగ్గరగా ఉన్న వంతెనపైకి ఎక్కి, ఆపై దూకుతానని బెదిరించాడు అని పోలీసు చెప్పాడు.

కాగా, అతడిని కిందకు దింపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఎన్నో విశ్వప్రయత్నాల ఆనంతరం.. బిర్యానీ, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఆ వ్యక్తి ఆత్మహత్యను విరమించుకొని కిందకు దిగాడని పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు కారణం ఏమనగా.. అతడు గతంలో టైల్స్ వ్యాపారం చేస్తూ ఎంతో నష్టపోయాడని, దీంతో అతని భార్య కూడా విడిచిపెట్టి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తెలిసింది. ఇక ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కోల్‌కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్ , అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని అతనితో మాట్లాడి ఒప్పించినట్లు చూపరులు తెలిపారు. ఒక వేళ ఆ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి జారిపడి ఉంటే, అతడు విద్యుత్ స్తంభాల ఈదర్ ఢీకొట్టి ఉండేవాడని, అలాగే కింద ఉన్న రైలు పట్టాలపై పడి తీవ్ర గాయాలపాలై ఉండేవాడని పోలీసులు భయపడ్డారు. మరి, బిర్యానీ , ఉద్యోగం ఇస్తాననడంతో ఆత్మహత్యను విరమించుకున్న ఆ వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments