BJP MP Videos Viral: బీజెపీ ఎంపీ అశ్లీల వీడియోలు వైరల్.. కేసు నమోదు

బీజెపీ ఎంపీ అశ్లీల వీడియోలు వైరల్.. కేసు నమోదు

ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా ఓ బీజెపీ ఎంపీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగం కావాల్సిన నేతను.. భయపెట్టేలా చేసింది.

ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. తాజాగా ఓ బీజెపీ ఎంపీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగం కావాల్సిన నేతను.. భయపెట్టేలా చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియా, సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. ఏ వీడియో వాస్తవమో, ఏదీ నకిలీదో తెలుసుకోవడం కష్టమౌతుంది. దీనికి సామాన్యులే కాదూ.. సెలబ్రిటీలు కూడా బలి అవుతున్నారు. తాజాగా బీజెపీ నేత ఒకరు ఈ ఉచ్చులో ఇరుక్కుపోయారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజెపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అందులో ఉత్తరప్రదేశ్ బారాబంకీ బీజెపీ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్‌కు మళ్లీ చోటు దక్కింది. ఈ ఆనందంలో ఉండగానే.. అతడికి ఊహించని సంఘటన ఎదురైంది. ఆ ప్రజా ప్రతినిధి కొంత మంది అమ్మాయిలతో అశ్లీలంగా ఉన్న కొన్ని వీడియోలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. నిమిషాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు ఎంపీ.

అమ్మాయిలతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో వెంటనే ఉపేంద్ర సింగ్ పోలీసులను ఆశ్రయించారు. ఆ వీడియోలో ఉపేంద్ర సింగ్ పోలి ఉన్న వ్యక్తి బెడ్ పై ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఐదు నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియో.. 2022 జనవరి 31వ తేదీని చూపిస్తోంది. రెండో వీడియో కూడా మే నాటిదిగా కనిపిస్తుంది. కాగా, ఈ వీడియోల్లో ఉన్నది తానను కాదని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు కొంత మంది ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ. ఈ వీడియోలు ఎడిట్ చేశారని, తన ఫోటోను మార్ఫింగ్ చేశారని అన్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగించి.. ఈ వీడియోలను రూపొందించినట్లు తెలిపారు.

బారా బంకీ నుండి తనకు మళ్లీ టికెట్ దక్కడంతో ఓర్వలేని ప్రత్యర్థులు.. ఇలా చేశారంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉపేంద్ర సింగ్. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్‌కు టికెట్ నిరాకరించి.. ఉపేంద్ర సింగ్ రావత్‌కు అవకాశం ఇచ్చింది బీజెపీ. తాజాగా 195 మంది అభ్యర్థులతో కూడా తొలి జాబితాను శనివారం విడుదల చేయగా.. మళ్లీ ఇతడికి అవకాశం ఇచ్చింది. కాగా, ఈ జాబితాలో 47 మంది యువతకు చోటు దక్కింది. 28 మంది మహిళా అభ్యర్థులు, 27 మంది షెడ్యూల్ కులాలు, 18 మంది షెడ్యూల్డ్ తెగలు , 57 మంది ఓబీసీ, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు ఉన్నారు.

Show comments