Dil Raju: సినిమా చూసే ప్రేక్షకులను చెడగొట్టింది మేమే.. దిల్ రాజు కామెంట్స్

Dil Raju Comments On Audience Watching Movies: తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. సినిమాలు చూసే ప్రేక్షకులను చెడగొట్టింది తామే అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Dil Raju Comments On Audience Watching Movies: తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. సినిమాలు చూసే ప్రేక్షకులను చెడగొట్టింది తామే అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు సినిమా వంద రోజులు, 200 రోజులు ఆడితే హిట్టు, సూపర్ హిట్టు, బ్లాక్ బస్టర్ హిట్టు అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారం రోజులు సినిమా ఆడడమే గగనం అయిపోయింది. ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమానే హిట్టు, సూపర్ హిట్టు, బ్లాక్ బస్టర్ అంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే వంటివి బాగున్నాయన్న టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు.. వచ్చినోళ్లు రిపీటెడ్ గా చూడడం లేదు. ఇదీ ప్రస్తుత సినిమాల పరిస్థితి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న దిల్ రాజు.. తాజాగా సినిమా ఎక్కువ రోజులు ఆడకపోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ప్రేక్షకులను థియేటర్స్ కి రాకుండా తామే చెడగొట్టామని దిల్ రాజు అన్నారు. సినిమాని నాలుగు వారాలకే ఓటీటీలోకి తీసుకొస్తుండడం వల్లే ఎక్కువ రోజులు థియేటర్స్ లో నిలబడడం లేదని అన్నారు. రేవు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో కొత్తవాళ్లతో సినిమాలు తీసే ప్రక్రియ ఎప్పుడూ కొనసాగుతుందని.. అయితే 99 శాతం సినిమాలు ఫెయిల్ అవుతాయని.. ఒక శాతం మాత్రమే సక్సెస్ రేటు ఉంటుందని అన్నారు. కెరీర్ ఆరంభంలో తాను సినిమాలు నిర్మించే సమయంలో ప్రేక్షకులు సినిమా చూస్తారా? సినిమా చూసేందుకు ఎలా వస్తారు? సినిమాలో ఇంకేం యాడ్ చేయాలి? అనుకుంటూ చేసేవాడినని అన్నారు. ఒకప్పుడు సినిమా తీయడం అంటే గొప్ప.

ఈరోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదని.. ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించడమే గొప్ప అని దిల్ రాజు అన్నారు. అదే పెద్ద ఛాలెంజ్ అని అన్నారు. తాము తీసిన బలగం, కమిటీ కుర్రోళ్ళు సినిమాలు మెల్లగా మౌత్ టాక్ ద్వారా ఆడియన్స్ కి చేరాయని.. అదే సమయంలో సినిమాలు బాగున్నాయని పాజిటివ్ రివ్యూలు రావడం కూడా కలిసొచ్చిందని అన్నారు. అయితే ప్రేక్షకులని చెడగొట్టింది తామే అని దిల్ రాజు అన్నారు. మీరు ఇంట్లో కూర్చోండి నాలుగు వారాల్లో సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తాం అని సినిమా చూసే ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా చెడగొట్టింది తామే అని సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలకి రాకపోవడానికి ఓటీటీ ఒక కారణమైనా.. టికెట్ ధరలు, కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరలు, పార్కింగ్ ఫీజులు వంటివి భారంగా ఉండడం కూడా మరొక కారణమని చెబుతున్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే 2 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని.. ఇది మిడిల్ క్లాస్ వారికి భారంగా ఉండడంతో ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అన్నట్టు థియేటర్స్ కి రావడం లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాకి మొదట్లో టికెట్ ధరలు పెంచినా ఆ తర్వాత తగ్గించాలని.. అలా చేస్తే ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కొన్ని సినిమాలు అలానే చేశాయని గుర్తు చేస్తున్నారు. మరి ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు థియేటర్స్ కి రాకుండా చెడగొట్టింది తామే అని దిల్ రాజు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments