బాలీవుడ్ ను ఏలేస్తున్న తెలుగు హీరోలు.. అక్కడ కూడా మన డామినేషనే

తెలుగు సినిమాలు బాలీవుడ్ ను ఏలేస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ తెలుగు సినిమాలు ఓ రేంజ్ లో సత్తా చూపిస్తున్నాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ పై మరో బాంబ్ పేల్చాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు సినిమాలు బాలీవుడ్ ను ఏలేస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ తెలుగు సినిమాలు ఓ రేంజ్ లో సత్తా చూపిస్తున్నాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ పై మరో బాంబ్ పేల్చాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అక్కడ కూడా మన డామినేషన్ అంటావేంట్రా.. అదుర్స్ లో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్.. ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు సరిగ్గా సరిపోతుంది . ఎందుకంటే, సాధారణంగా కథలో కంటెంట్ ఉంటే.. ఆడియన్స్ ఆ మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళ్తారు. అలాగే ఆ కంటెంట్ ను కరెక్ట్ గా ఎలివేట్ చేయాలంటే సరైన కట్ అవుట్ ఉండి తీరాల్సిందే. అలాంటి కట్ ఔట్స్ కేవలం టాలీవుడ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ ను ఏలేస్తున్నారు. ఇప్పటికే అక్కడ అనేక తెలుగు సినిమాలు మంచి వసూళ్లను అందుకున్నాయి. దాదాపు బాలీవుడ్ గడ్డపై తెలుగు జెండా పాతినట్లే. పైగా బాలీవుడ్ హీరోలు చేయలేని పని కూడా పాన్ ఇండియా స్టార్స్ చేస్తున్నారు. అక్కడ మూతపడిన ఎన్నో థియేటర్స్ కు.. తమ సినిమాలతో ప్రాణం పోశారు. చూడబోతుంటే బాలీవుడ్ పై దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు.

ఒకప్పుడు ఇండియన్ మూవీస్ లో బాలీవుడ్ దే పై చేయి. కానీ ఇప్పుడు అలా లేదు.. ఖాన్ లు కపూర్ ల దగ్గర నుంచి బీ టౌన్ లో ఉన్న బడా హీరోలంతా కామ్ అయిపోయారు. 2023 లో జవాన్ , పఠాన్ , గద్దర్ 2 లాంటి సినిమాలు బీ టౌన్ ను రఫ్ ఆడించాయి. ఇక ఆ తర్వాత ఆ రేంజ్ లో చెప్పుకోదగిన సినిమాలు అంటే 2024 లో వచ్చిన స్త్రీ2 సినిమానే. నెక్స్ట్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను గట్టెక్కించిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అది హనుమాన్ , కల్కి , దేవర లాంటి సినిమాలే. ఇక ఫ్యూచర్ లో కూడా బాలీవుడ్ నుంచి సౌండ్ చేసే సినిమాలు పెద్దగా ఏమి లేవు. సల్మాన్ ఖాన్ నుంచి సికిందర్ సినిమా ఉన్నా కూడా.. అంతా బజ్ వినిపించడంలేదు. వార్ 2 సినిమా పర్లేదు అనిపించుకుంటుంది. కానీ అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉండనే ఉన్నాడు. ఇలా చూసినట్లయితే టాలీవుడ్ హీరోల హావనే నడుస్తుంది. ఇప్పటివరకు ప్రభాస్ , తారక్ తమ సినిమాలతో రూల్ చేశారు. ఇక ఇప్పుడు బన్నీ , చరణ్ వంతు.

డిసెంబర్ 6న పుష్ప-2 సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ మొదటి పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ తెలియనిది కాదు. ఇక ఇప్పుడు పార్ట్ 2 అంతకు మించి ఉండబోతుంది. ఆ తర్వాత ఈ దండయాత్రను కొనసాగించడానికి చరణ్ లైన్ లో ఉన్నాడు. సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది. రెబెల్ స్టార్ , యంగ్ టైగర్ లా .. ఐకాన్ స్టార్ , గ్లోబల్ స్టార్ కూడా బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేయడం ఖాయం. ఈ సినిమాలు కాకుండా సందీప్ రెడ్డి వంగ- ప్రభాస్ కాంబోలో ఓ మూవీ, ప్రశాంత్ నీల్- తారక్ కాంబో లో ఓ మూవీ , హను రాఘవపూడి-ప్రభాస్ కాంబోలో ఓ మూవీ , జక్కన్న- మహేష్ కాంబో లో ఓ మూవీ.. ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ నుంచి రాబోయే పాన్ ఇండియా చిత్రాల లిస్ట్ చాలానే ఉంది. సో బాలీవుడ్ పై టాలీవుడ్ హీరోల దండయాత్ర ఇప్పట్లో ఆగదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments