Swetha
ఒకప్పటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ హీరోలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రెబెల్ స్టార్ కృష్ణం రాజు. జనవరి 20న కృష్ణ రాజు జయంతి సందర్బంగా ఆయన సతీమణి శ్యామల.. ఆయనను గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలని మీడియాతో పంచుకున్నారు.
ఒకప్పటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ హీరోలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రెబెల్ స్టార్ కృష్ణం రాజు. జనవరి 20న కృష్ణ రాజు జయంతి సందర్బంగా ఆయన సతీమణి శ్యామల.. ఆయనను గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలని మీడియాతో పంచుకున్నారు.
Swetha
ఆనాటి తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కేవలం కొంతమంది సినీ దిగ్గజాల మధ్యనే తిరిగేది. వారే కొంతకాలం పాటు ఇండిస్ట్రీని నిలబెట్టారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వారిలో కొంతమంది హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయినా ఎక్కువగా విలన్ పాత్రలు చేసిన వారు ఉన్నారు. అయినా కూడా ప్రేక్షకుల మదిలో ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా వారి ప్రతిభను కనబరిచారు. వారిలో ఒకరు రెబెల్ స్టార్ కృష్ణం రాజు. ఆయన తన సినీ ప్రస్థానంలో ఎన్నో కష్టనష్టాలను చూసి.. తిరిగి హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. తెలుగు నాట మొదటి తరం రెండో తరం హీరోల తర్వాత తనకంటూ గుర్తుంపును, స్థానాన్ని సంపాదించుకున్న హీరో కృష్ణంరాజు. జనవరి 20న కృష్ణంరాజు జయంతి సంధర్బంగా ఆయన సతీమణి.. వారి మధ్యన ఉన్న అనుబంధాన్ని, కష్ట కాలంలో ప్రభాస్ ఇచ్చిన ధైర్యం గురించి పంచుకున్నారు.
కృష్ణంరాజు గారు కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా.. బయట కూడా ఎంతో మందిని ఆదరిస్తూ.. అందరిని సరి సమానంగా చూస్తూ ఉండేవారు. ఆయన తన మంచితనంతో , సేవా భావంతో ఎంతో మంది హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం కృష్ణంరాజు స్వర్గస్తులైనపుడు ఎంతో మంది అభిమానుల కళ్ళు చెమ్మగిల్లాయి. కృష్ణంరాజు పేరు తలచుకుంటే ఆయనతో పాటు ముందుగా గుర్తొచ్చే మరొకరు.. ఆయన సతీమణి శ్యామల దేవి. కృష్ణంరాజు స్వర్గస్తులైన తర్వాత ఆమె అంతగా బయట కనిపించడం లేదు. తాజాగా, శ్యామల దేవి.. కృష్ణంరాజు గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. అంతే కాకుండా ఆ భాదలోనుంచి బయటకు రావడానికి.. ప్రభాస్ చెప్పిన మాటలను కూడా పంచుకున్నారు. “మనం ఇంకెప్పుడు కూడా పెదనాన్న గారు లేరు అనే పదం.. మన నోటా వినొద్దు.. ఎవరి నోటా వినొద్దు. ఆయన లేరు అన్నారంటే మనం బ్రతకలేము. పెదనాన్న గారు ఎక్కడికి వెళ్ళలేదు. మీతోనే ఉన్నారు. మీరు బయటకి రావాలి. పెదనాన్న గారిని నమ్ముకుని ఎంతో మంది బయట ఉన్నారు. పెదనాన్న గారు లేరు.. మీరు కూడా ఎవరికీ కనిపించకపోతే.. అభిమానులు ఎంత బాధపడతారు.” అంటూ నన్ను బయటకు తీసుకొచ్చాడు. అని శ్యామల ప్రభాస్ ,కృష్ణంరాజు గారి గురించి చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా.. తాను బయటకు వచ్చిన తర్వాతే కృష్ణంరాజు గారు ఇంకా బ్రతికే ఉన్నారనే భావనలో ఉన్నానని చెప్పారు. కృష్ణంరాజు గారి జ్ఞాపకార్థమే ఇప్పుడు మీరు చూస్తున్న శ్యామాల దేవి అంటూ కంటతడి పెట్టుకున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల పాటు సాగిన వారి వైవాహిక జీవితంలో జరిగిన కొన్ని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఏదేమైనా.. సినీ పరిశ్రమలో దాదాపు 55 యేళ్లకు పైగా నటుడిగా ఆయన ప్రస్థానం సాగింది. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి తెలుగు నాట మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆయన వారస్వత్వంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు కూడా.. మంచి హిట్స్ ను అనుదుకున్నాయి. మరి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సంధర్బంగా ఆయన సతీమణి.. ప్రభాస్ గురించి ప్రస్తావించిన వ్యాఖ్యలపై.. మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.