Sridevi Vijaykumar: శ్రీదేవి.. 22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ! ప్రభాస్​పై స్వీట్ కామెంట్స్!

Sridevi Vijaykumar About Prabhas: సినీ ఇండస్ట్రీలో కొన్ని పెయిర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. స్క్రీన్ మీద వాళ్లు చేసిన మ్యాజిక్​ను ఆడియెన్స్, ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. అంతలా అభిమానుల గుండెల్లో ముద్ర వేసిన జంటల్లో ఒకటి ప్రభాస్-శ్రీదేవి విజయ్​కుమార్​ది.

Sridevi Vijaykumar About Prabhas: సినీ ఇండస్ట్రీలో కొన్ని పెయిర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. స్క్రీన్ మీద వాళ్లు చేసిన మ్యాజిక్​ను ఆడియెన్స్, ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. అంతలా అభిమానుల గుండెల్లో ముద్ర వేసిన జంటల్లో ఒకటి ప్రభాస్-శ్రీదేవి విజయ్​కుమార్​ది.

సినీ ఇండస్ట్రీలో కొన్ని పెయిర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. స్క్రీన్ మీద వాళ్లు చేసిన మ్యాజిక్​ను ఆడియెన్స్, ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. అంతలా అభిమానుల గుండెల్లో ముద్ర వేసిన జంటల్లో ఒకటి ప్రభాస్-శ్రీదేవి విజయ్​కుమార్​ది. వీళ్లిద్దరూ కలసి నటించిన సినిమా ‘ఈశ్వర్’. 22 ఏళ్ల కింద రిలీజైన ఈ సినిమా ప్రభాస్​కు డెబ్యూ మూవీ కావడం విశేషం. ‘ఈశ్వర్​’ హిట్​ అవడంతో హీరోగా నిలదొక్కుకున్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ స్టార్ హీరో అయిపోయాడు. ‘బాహుబలి’ సిరీస్​తో పాన్ ఇండియా స్టార్​గా ఎదిగాడు. ‘ఈశ్వర్’తో క్యూట్ పెయిర్​గా పేరు తెచ్చుకున్న ప్రభాస్-శ్రీదేవి విజయ్​కుమార్ మళ్లీ ఇంకో సినిమాలో కలసి నటించలేదు. ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన శ్రీదేవి ఇప్పుడు కమ్​బ్యాక్ ఇస్తున్నారు. ‘సుందరకాండ’ చిత్రంతో తిరిగి ప్రేక్షకులను పలకరిచేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రభాస్ గురించి స్వీట్ కామెంట్స్ చేశారు.

ప్రభాస్​ నిజమైన డార్లింగ్​ అని చెప్పిన శ్రీదేవి విజయ్ కుమార్.. ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయన్ను అందరూ అలాగే పిలుస్తారని అన్నారు. ‘ఈశ్వర్’ సినిమా టైమ్​లో ఎలా ఉన్నారో ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని చెప్పారు. ఇన్నేళ్లలో ప్రభాస్ కొంచెం కూడా మారలేదన్నారు. ఆయన విషయంలో సంతోషంగా ఉందన్నారు. ప్రభాస్​తో మళ్లీ నటిస్తే చాలా బాగుంటుందని శ్రీదేవి మనసులోని కోరికను బయటపెట్టారు. ఆయన పక్కన అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని పేర్కొన్నారు. క్యారెక్టర్ కంటే ఆ సినిమా బాగుండాలనే దానికి అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాము కలసి నటించిన ‘ఈశ్వర్’ రీరిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు శ్రీదేవి.

ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23. ఆ రోజున ‘ఈశ్వర్​’తో పాటు ఆయన నటించిన మరో హిట్ ఫిల్మ్ ‘డార్లింగ్’ను కూడా రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి పైవిధంగా కామెంట్ చేశారు. ‘ఈశ్వర్’ను మళ్లీ తెర మీద చూసి ఎంజాయ్ చేసేందుకు వెయిట్ చేస్తున్నానని అన్నారు. ఇక, ‘సుందరకాండ’ మూవీతో రీఎంట్రీకి రెడీ అయిపోయారు శ్రీదేవి. నారా రోహిత్ హీరోగా వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్షన్​లో రూపొందిన ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్​లో పాల్గొన్న శ్రీదేవి ‘సుందరకాండ’ మూవీ విశేషాలతో పాటు కమ్​బ్యాక్ గురించి స్పందించారు. అలాగే ప్రభాస్​తో మళ్లీ నటిస్తారా అనే ప్రశ్నకు పైవిధంగా రియాక్ట్ అయ్యారు. మరి.. ప్రభాస్-శ్రీదేవి విజయ్ కుమార్ మళ్లీ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.

Show comments