Swetha
అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప-2 సినిమా నుంచి.. అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఈరోజున టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పుష్ప-2 టీజర్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే ఈ టీజర్ వెనుక ఉన్న అసలు కథేంటో తెల్సుకుందాం.
అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప-2 సినిమా నుంచి.. అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఈరోజున టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం పుష్ప-2 టీజర్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయితే ఈ టీజర్ వెనుక ఉన్న అసలు కథేంటో తెల్సుకుందాం.
Swetha
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ఈరోజు పుష్ప-2 టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్కొక్కటిగా వస్తున్న అప్ డేట్స్ ప్రేక్షకులను భారీ అంచనాలను పెంచేసిన మాట నిజమే. కానీ ఈరోజు విడుదల చేసిన టీజర్ మాత్రం అంచనాలకు మించి ఉంది. టీజర్ ఏ ఈ రేంజ్ లో ఉంటే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.. థియేటర్ లో ఈ సీన్స్ ఎంత మందికి పూనకాలు తెప్పిస్తాయో.. అందరూ ఈజీగా ఊహించగలరు. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ లో అల్లు అర్జున్ లేడి గెట్ అప్ లో .. అమ్మ వారి భీకర రూపంతో దర్శనం ఇచ్చాడు. ఈ సినిమా మొదటి పార్ట్ నుంచి కూడా ఎర్ర చందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతోంది కనుక.. టీజర్ లో చూపించింది.. ఖచ్చితంగా గంగమ్మ జాతరకు సంబంధించిన విజువల్స్ అని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే కొంతమంది అసలు ఎందుకు ఈ జాతరకు అంత ప్రత్యేకత ఇచ్చారు అనే సందిగ్ధంలో ఉన్నారు. దీని గురించి తెల్సుకుందాం.
ఈ సినిమా కథ అంతా కూడా తిరుపతిలోనే సాగుతోంది. అయితే, తిరుపతి గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ . ఈ అమ్మవారి జాతరను ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ జాతరకు సుమారు 900 ఏళ్ళ చరిత్ర ఉందట. సాక్షాత్తు ఈ అమ్మవారు శ్రీ వేంకటేశ్వరుని చెల్లెలని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే, వారం రోజుల పాటు జరుపుకునే ఈ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. పూర్వము తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించేవారట. అందులో ఒక పాలెగాడు తన రాజ్యంలో ఉండే అందమైన యువతులను బలాత్కరించేవాడట. ఇలాంటి వారందరిని అంతం చేసేందుకు.. తిరుపతికి 2 కి.మీ దూరంలో అవిలాల అనే గ్రామంలో కైకాల కులంలో గంగమ్మ జన్మించిందని అక్కడి వారంతా నమ్ముతారు. ఆమెకు భయపడి పాలెగాడు రకరకాల వేషాలు వేసి.. అక్కడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని.. చివరికి నాలుగవ రోజున గంగమ్మ దొరవేషం వేసి అతనిని అంతమొందించిందని భక్తుల విశ్వాసం. అందుకోసమే తమను చల్లగా చూడాలంటూ.. ప్రతి ఏటా అక్కడ ఈ జాతరను జరుపుకుంటారట.
ఇక ఈ జాతరలో మొదటి రోజున బైరాగివేషం , రెండవ రోజున బండ వేషం, మూడవ రోజున తోటి వేషం, నాలుగవ రోజున దొర వేషం, ఐదవ రోజున మాతంగి వేషం, ఆరవ రోజున సున్నపుకుండల వేషం, ఏడవ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. ఇలా ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు. మరి టీజర్ లో అల్లు అర్జున్ ధరించింది ఏ వేషం అనేది తెలుసుకోవాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. టీజర్ తోనే గూస్ బంప్స్ తెప్పించేసిన పుష్ప-2 సినిమా .. థియేటర్ లో ఎటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందా అని.. అందరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. మరి, పుష్ప-2 సినిమా టీజర్ వెనుక దాగి ఉన్న కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.