రాజమౌళి దారిలో సుకుమార్- బన్నీ.. పుష్ప 2 కోసం పెద్ద ప్లానే!

తాజాగా జర్మనీలో జరిగిన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మరి బన్నీ ఆ ఫెస్టివల్ కు వెళ్లడంతో.. దీని గురించి కొత్త డిస్కషన్స్ మొదలయ్యాయి.

తాజాగా జర్మనీలో జరిగిన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మరి బన్నీ ఆ ఫెస్టివల్ కు వెళ్లడంతో.. దీని గురించి కొత్త డిస్కషన్స్ మొదలయ్యాయి.

ఏ రంగంలోనైనా ప్రముఖులతో పరిచయం పెంచుకోవడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా సినిమా రంగంలో ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద వారితో పరిచయం పెంచుకుంటూ ఉండాలి. అయితే, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో.. ఈ విషయాన్నీ ఇప్పటివరకు చాకచక్యంగా హ్యాండిల్ చేసింది కేవలం రాజమౌళి మాత్రమే. బాహుబలి 1,2 , ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు ప్యాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అవార్డులను సంపాదించుకున్నాయంటే.. దానికి కారణం లాంగ్వేజ్ బారియర్ లేకుండా .. అన్ని ప్రాంతాలలోను ఈ సినిమాలను ప్రమోట్ చేయడమే. ఇలా అందరితో పరిచయాలను పెంచుకోవడంలో ముందుండే వ్యక్తి రాజమౌళి. అయితే, తాజాగా జర్మనీలో జరిగిన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘పుష్ప 2’ టీమ్ మెరిశారు.  ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చనీయాంశంగా మారింది. సుకుమార్, బన్నీ కూడా రాజమౌళి దారిలోనే వెళ్తున్నారా ! ఈసారి పుష్ప-2 కోసం సుకుమార్ పెద్ద ప్లాన్ ఏ వేశారా! అనే డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి.

నిజానికి ఇలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనడం.. అక్కడకు వచ్చిన ఫేమస్ సినీ ప్రముఖులతో రిలేషన్స్ ను బిల్డ్ చేసుకోవడం. అలానే, ముఖ్యమైన దర్శకులు, నిర్మాతలు, పెద్ద పెద్ద సంస్థలను కలవడం .. ఇలా అందరితో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ద్వారా .. వారి సినిమాను వరల్డ్ వైడ్ గా మార్కెట్ లోకి దించడం అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజి .. అలాగే సినిమాను ప్రమోట్ చేసుకోడానికి కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్. సరిగ్గా ఇదే పద్దతిని ఫాలో అయ్యి రాజమౌళి తన హీరోలను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏ రేంజ్ లో ప్రమోషన్స్ జరిగాయో అందరికి తెలిసిన విషయమే. వారి వద్ద ఉన్న కంటెంట్ యూనివర్సల్ గా ఉండి.. దానిని భారీ బడ్జెట్ తో తెరకెక్కించినపుడు.. బయట మార్కెట్ లో కూడా దానికి భారీగానే డిమాండ్ ఉంటుందని రాజమౌళి ప్రూవ్ చేశాడు. తాజగా ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాను కూడా.. ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే వే ను ఫాలో అవుతున్నారు పుష్ప-2 మేకర్స్.

తాజాగా జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు .. అల్లు అర్జున్ వెళ్ళాడు. అక్క‌డ పుష్ప ప్రీమియ‌ర్ జరిగింది. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ పనులను బ్రేక్ లేకుండా కొనసాగిస్తున్నాడు దర్శకుడు. అయినా సరే.. బన్నీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని .. పుష్ప-2 నిర్మాత మైత్రి రవిశంకర్‌తో కలిసి బెర్లిన్‌కు వెళ్లాడు. నిజానికి పుష్ప పార్ట్ -1 కు వరల్డ్ వైడ్ గా వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు. ఇప్పుడు ఈ మూవీ సిక్వెల్ ను అంతకుమించి తీసుకువెళ్లాలి అంటే.. ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సినిమాకు అన్ని విధాల కలిసి రావాలంటే.. ఇలాంటి సినీ ఫెస్టివల్స్ లో ప్రముఖులతో బాండింగ్ పెంచుకోవడం అవసరం. కాబట్టి సరిగ్గా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు సుకుమార్ , బన్నీ.

అయితే, పుష్ప-2 చిత్రాన్ని తెలుగుతో పాటు.. హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఇక ఇప్పుడు అమెరికా, బ్రిటిన్ తో పాటు యూర‌ప్ దేశాల్లో గ‌ల్ఫ్‌, ఐల్యాండ్ కంట్రీస్ లో కూడా.. పుష్ప-2 సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. గతంలో పుష్ప పార్ట్ -1 రష్యన్ భాషలో విడుదలైంది. సో ఇప్పుడు పుష్ప-2 ను కూడా అక్కడ విడుదల చేసి.. బన్నీ స్థాయిని ఇంకాస్త పెంచే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా చైనీస్ భాషలోనూ ఈ సినిమాను విడుదల చేస్తారా ! అనే టాక్స్ కూడా నడుస్తున్నాయి. సో ప్రస్తుతానికి సుకుమార్, బన్నీ వారి చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments