Nagendra Kumar
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందానా నటించిన పుష్ప2 చిత్రం ఇంకొన్ని నెలలో థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పుష్ప2 సినిమా విడుదలపై పెద్ద సవాళ్లను ఎదుర్కొవలసి ఉంటుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందానా నటించిన పుష్ప2 చిత్రం ఇంకొన్ని నెలలో థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పుష్ప2 సినిమా విడుదలపై పెద్ద సవాళ్లను ఎదుర్కొవలసి ఉంటుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే..
Nagendra Kumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందానా కాంబినేషన్లో సుకుమార్ తీర్చిదిద్దిన గొప్ప సంచలనం పుష్ప అల్లు అర్జున్ రేంజ్ ని ఇండియా లెవెల్లో అమాంతం పెంచేసింది. తెలుగు హీరో అనే స్థాయిని పుష్ప సాధించిన ప్రచండ విజయంతో అల్లు అర్జున్ దాటిపోయి, పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోయాడు. అభిమానులు కూడా పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చారు అల్లు అర్జున్ కి. అల్లు వారబ్బాయంటే నార్త్ లో మామ్మూలు పిచ్చి కాదు. వెర్రెక్కిపోతారు అక్కడి అడియన్స్. పుష్ప 2 గురించి వాళ్ళ ఎదురుచూపులు మామ్మూలు రేంజ్ లో లేవు. నార్త్ బెల్ట్ మొత్తం పుష్ఫ పోస్టర్ గానీ, అల్లు అర్జున్ కటౌట్ గానీ కనిపించినా అక్కడే ఆగిపోయేంత మైకంలో ఉన్నారని నార్త్ మీడియా కోడై కూస్తోంది. అక్కడి యాక్టర్లే ఎందరో అల్లు ఐకాన్ కి వీరాభిమానులు. పుష్ఫ అందుకున్న సక్సెస్ కూడా ఆషామాషీ కాదు. హిందీవాళ్ళు మొత్తం ఊ అంటావా పాటని కంఠస్త పెట్టేసి, టీవీ ప్రోగ్రామ్స్ కి హాజరైనప్పుడు పాడడం మొదలెట్టారు.
ఈ బ్యాక్ డ్రాప్ లో, పుష్ఫ 2 సునాయాసంగా 1000 క్రోర్ క్లబ్లో చేరిపోతుందని ట్రేడ్ పండిట్స్ అనుకున్నవాళ్ళంతా అంచానాలు కట్టారు. రికార్డులని స్మేష్ చేసేస్తుందని రాశారు. ఈ మధ్య వరకూ కూడా రాస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళ సమీక్షలో ఈ మధ్య చిన్న తేడా వచ్చింది. పుష్ఫ ద రైజ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీసు దగ్గర 350 కోట్లు కలెక్ట్ చేస్తే, అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే…..ఒక్క హిందీలోనే వంద కోట్లు రాబట్టడం. ఈ బేస్ తో, అల్లు అర్జున్ పుష్ఫ క్యారెక్టర్లో స్ట్రాంగ్ పెరఫారమెన్స్ తో వచ్చిన పాప్యులారిటీ, ఫాలోయింగ్ లతో వెయ్యి కోట్లు దాటిపోవడం గానీ, లేదా చేరుకోవడం కానీ అదేమంత పెద్ద కష్టం కాదు,అసాద్యమేమీ కానేకాదన్ని తీర్మానానికి వచ్చారు ట్రేడ్ పండితులు.
కానీ ఇప్పడు వాళ్ళంతా ఆలోచనలో పడినట్టుగా కనిపిస్తోంది. ఈ సారి పుష్ఫ 2కి అంత సజావైన పరిస్థితులు కనిపించడం లేదు, పరమ ఈజీ అనుకున్న వెయ్యికోట్ల బెంచ్ మార్క్ ఈ సారి టఫ్ అవుతుందేమోనన్న సందిగ్ధంలో పడ్డారంతా. దానికి కారణం ఏంటంటే పుష్ఫ2 గట్టి అపోజిషనే ఈ రౌండ్ లో ఎదుర్కోబోతోందని ఊహిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, హిందీ బెల్ట్ లో స్మూత్ సైలింగ్ ఉండకపోవచ్చన్నది ఒక అంచనా. మరో రెండు సినిమాలు జూలు విదిలిస్తున్నాయి. బరిలోకి ఉరుకుతున్నాయి. అందులో ఒకటి…..భారీ మల్టీ స్టారర్ సింఘం ఆగస్టు 15, 2024కి ధియేటర్ల మీదకి దూకబోతోంది. అక్షయ్ కుమార్, అజెయ్ దేవగన్, దీపికా పడుకొనే, కరీనా కపూర్, టైగర్ షరాఫ్ అండ్ అర్జున్ కపూర్ వంటి భారీ కేస్టింగ్ అండ కాంబోలో సింఘం పెద్ద సందడే చేయబోతోంది. కన్నడలో అక్కడి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ యాక్ట్ చేసిన బైరాతి రనగల్ కూడా సేమ్ డేనే రిలీజ్ అవుతోంది.
ఈ రెండు సినిమాలు భారీ అంచనాలను మోస్తున్నాయి. ఆడియన్స్ కూడా ఈ రెండిటిని గురించి చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రెండూ క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్సే. పుఫ్స రిలీజు నాటి ఇండిపెండెంట్ రిలీజ్ కంఫర్ట్ ఈ సారి పుష్ఫ 2కి కనిపించడం లేదు అని పండిట్స్ పరిశీలనగా కనిపిస్తోంది. ముందుగా అంచానాలు కట్టినట్టుగా, పుష్ఫ 2 వెయ్యికోట్ల ఫేన్సీ ఫిగర్ని క్రస్ చేయాలన్నా, చేరుకోవాలన్నా కూడా సినిమా అలాఇలా ఉంటే సరిపోదు. దుమ్ము లేపేస్తేగానీ కుదరదు. కాంప్టీషన్లో కుమ్మేస్తేగానీ పుష్ఫ 2 రికార్డు క్రియేట్ చేయలేదని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.