Mamitha baiju to Join With a Star Hero: జాక్ పాట్ కొట్టిన ప్రేమలు బ్యూటీ.. ఏకంగా ఆ స్టార్ హీరో తో !

జాక్ పాట్ కొట్టిన ప్రేమలు బ్యూటీ.. ఏకంగా ఆ స్టార్ హీరో తో !

Mamitha baiju to Join With Vijay Thalapathy: విజయ్ దళపతి సినిమాలకు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలియనిది కాదు. ఈ క్రమంలో తాజాగా ఆయన నటించబోయే సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Mamitha baiju to Join With Vijay Thalapathy: విజయ్ దళపతి సినిమాలకు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలియనిది కాదు. ఈ క్రమంలో తాజాగా ఆయన నటించబోయే సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళ హీరో విజయ్ దళపతి గురించి తెలుగునాట ప్రత్యేకమైన పరిచయం అవసరం. తెలుగులో కూడా విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన విజయ్. త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టె ముందు.. ఇప్పుడు నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైం చిత్రం కాకుండా.. దళపతి 69 అంటూ మరొక ఇంట్రెస్టింగ్ మూవీ కూడా రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే విజయ్ దళపతి మొదటి సారి దర్శకుడు హెచ్. వినోద్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైం చిత్రం.. సెప్టెంబర్ 5 న థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ తర్వాత.. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ మూవీ గురించి.. అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈసారి విజయ్ దళపతి మూవీలో.. ప్రేమలు మూవీతో అందరిని కట్టిపడేసిని మమిత బైజు.. ప్రధాన పాత్రలో నటించనుందట. ఈ మలయాళ భామ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ అదే కనుక నిజమైతే ఈ అమ్మడు జాక్ పాట్ కొట్టినట్లే. ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.

ప్రేమలు సినిమా కంటే ముందే ఎన్నో సినిమాలలో నటించినా కానీ.. ప్రేమలు తర్వాత మాత్రమే మమిత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మళయాళంతో పాటు తెలుగులో కూడా ఈ అమ్మడు కుర్రాళ్ళ క్రష్ లిస్ట్ లో యాడ్ అయిపొయింది. దీనితో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీ రోల్ లో నటించబోతున్నట్లు సమాచారం. కాగా దళపతి 69 సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ బ్యానర్ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments