‘నా పెట్టే తాళం’ సాంగ్.. ముందు తెలియదు అంటోన్న జబర్దస్త్ సత్యశ్రీ!

తెలుగు బుల్లితెరపై గిలిగింతలు పెడుతోన్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇప్పుడు వెండితెరపై కూడా ఆఫర్లను పొందుతూ దూసుకెళుతున్నారు. అటువంటి వారిలో ఒకరు సత్య శ్రీ. చమ్మక్ చంద్ర టీంలో చేసి.. ఆ తర్వాత క్విట్ అయ్యి.. మళ్లీ తిరిగి వచ్చింది.

తెలుగు బుల్లితెరపై గిలిగింతలు పెడుతోన్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇప్పుడు వెండితెరపై కూడా ఆఫర్లను పొందుతూ దూసుకెళుతున్నారు. అటువంటి వారిలో ఒకరు సత్య శ్రీ. చమ్మక్ చంద్ర టీంలో చేసి.. ఆ తర్వాత క్విట్ అయ్యి.. మళ్లీ తిరిగి వచ్చింది.

బుల్లితెరపై కామెడీ షోగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి అందరికే తెలిసిందే. ఈ షో ద్వారా ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తున్న ఆర్టిస్టులకు మంచి గుర్తింపు వచ్చింది. అలా జబర్దస్త్ షోతో పాపులరైన ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో ఆవకాశాలు అందుకుంటూ.. సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉంటే మొదటిలో జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు కేవలం మగ కంటెస్టులు మాత్రమే సందడి చేసేవారు. ఇక అవసరమైనప్పుడు లేడీ గెటప్స్ వేసి ప్రేక్షకులను నవ్వించేవారు. కానీ ఆ తర్వాత ఈ షోలో లేడీ కమెడియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. లేడీ కమెడియన్‌గా తన అంద చందాలతో.. మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న వారిలో సత్య శ్రీ ఒకరు. అలా సత్య జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర టీమ్ ద్వారా పరిచయం అయ్యింది. ఇలా మంచి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే చంద్ర స్కిట్స్ సత్యకి మంచి ఫేమ్‌ని తెచ్చిపెట్టింది.

ఈ షోలో కొన్ని కారణాల వల్ల చమ్మక్ చంద్ర ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఈమె కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె పలు కార్యక్రమాలలో సందడి చేసిన పెద్దగా ఆదరణ రాలేదు. ఇలా ఉంటే ఇప్పుడు సత్య మళ్లీ జబర్దస్త్‌లో సందడి చేస్తోంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా సత్యకు ఓ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఆ మూవీలో ఓ పాటకి స్టెప్పులు కూడా వేసింది. అలా స్టెప్పులు వేసినా సత్య పై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చే మొదలైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. సత్యశ్రీ.. నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో ఓ పాత్రను పోషించింది. ఆ మూవీలో ‘నా పెట్టే తాళం’ అంటూ ఓ పాటకి సత్య , సోనియా సింగ్‌లు పోలీస్ స్టేషన్లో స్టెప్పులు వేశారు. ఇక ఆ పాటని చూసిన ప్రేక్షకులు తెగ ఫైర్ అవుతున్నారు. ఏంటీ ఈ వల్గారిటీ అంటూ తిట్టిపోస్తున్నారు.  అలాగే పాటలో సత్య, సోనియా వేసిన స్టెప్పులపై ట్రోలింగే జరుగుతుంది.

ఒక వేళ పోలీసులు ఈ సినిమాను చూస్తే మాత్రం దర్శకుడు వంశీ మీద కేసు కూడా పెడతారేమో అనేట్టుగా ఉంది ఆ పాట డిజైనింగ్. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటే లేడీ కానిస్టేబుల్స్ విధుల్లో ఇలానే చేస్తారా? పోలీస్ స్టేషన్లో ఇలా పిచ్చి గెంతులు కూడా వేస్తారా? అయిన ఇలాంటి డబుల్ మీనింగ్స్‌తో కూడిన ఈ పాటకి సత్య ఎలా ఒప్పుకుందా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అయితే దీనిపై సత్యశ్రీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా తనకు ఈ సినిమా క్యారెక్టర్ ఉందని ఆఫర్ చేశారట దర్శకుడు. ఆ పాత్రకు ఓ పాట కూడా ఉంటుందని, డ్యాన్స్ కూడా చేయాల్సి ఉంటుందని, సిట్యువేషన్‌కు తగ్గట్టుగా వచ్చే పాట అని చెప్పారట. కానీ ఆ పాట పేరు చెప్పలేదు. ఇక సీన్ చేసే ఒక్క రోజు ముందే ఆ పాట పేరు చెప్పారట. ఆ రాత్రి ఆ పాట గురించి తెలుసుకుందట. ఆ పాటను వినేసిందట.

అయ్యో ఇలాంటి పాటనా? తెలియకుండా ఒప్పుకున్నానే.. ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్పలేను.. ఎలా చేయాలో అనే సందేహంలో పడిందట , ఇక ఆ పాటకు సంబంధించి.. తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్ పెట్టలేక పదిహేను టేకులు తీసుకుందట. అయితే దర్శకుడు వంశీ వల్గర్‌గా ఏం చూపించడం లేదు కదా? ఎక్స్‌పోజ్ చేయమని చెప్పడం లేదు కదా? తెరపై నీకు అలా అనిపించదు అని కన్విన్స్ చేశాడట. శేఖర్ మాస్టర్ సైతం తనకి అర్ధమయ్యేలా సినిమాలో ఓ క్యారెక్టర్ రావడం, దానికి ఓ పాట కూడా ఉండటం రేర్‌గా జరుగుతుందని, వచ్చిన అవకాశాన్ని వాడుకో అని సర్ది చెప్పారట. అలా చివరకు ఆ పాటను పూర్తి చేసినట్టుగా సత్య తెలిపింది. చమ్మక్ చంద్ర లాంటి డబుల్ మీనింగ్ స్కిట్టులో కూడా తన హద్దు దాటలేదు సత్యశ్రీ. కానీ ఈ పాటలో వల్గర్ స్టెప్పులతో కనిపించేసరికి నెటిజన్లు ఫైర్ అవ్వడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments