Swetha
టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఈ క్రమంలో గత ఏడాది రిలీజ్ అయినా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "మ్యాడ్" సినిమాకు కూడా సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఈ క్రమంలో గత ఏడాది రిలీజ్ అయినా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "మ్యాడ్" సినిమాకు కూడా సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
Swetha
ఇండస్ట్రీలో సూపర్ హిట్ సక్సెస్ సాధించిన సినిమాలకు వెంటనే సిక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఇండస్ట్రీలో సిక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. పైగా సిక్వెల్ గా వచ్చిన సినిమాలు కూడా ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ సంపాదించుకుంటున్నాయి. తాజాగా వచ్చిన డీజే టిల్లు సిక్వెల్ టిల్లు స్క్వేర్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ మూవీ.. అనుకోని విధంగా సూపర్ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాకు యూత్ నుంచి లభించిన స్పందన .. మ్యాడ్ సినిమాపై మరింత క్రేజ్ సంపాదించింది. అయితే, ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ కారణంగా ఇప్పుడు.. మ్యాడ్ మూవీ కి సిక్వెల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఏంటి అనే విషయాల గురించి చూసేద్దాం.
ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా.. తక్కువ బడ్జెట్ తో రూపొందించి.. స్టార్ సెలెబ్రిటీలు కూడా లేకుండా.. రూపొందించిన సినిమాలలో “మ్యాడ్” సినిమా ఒకటి. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక అతనితో పాటు.. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక లీడ్ రోల్స్ లో నటించి .. ప్రేక్షకులను అలరించారు. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ రేంజ్ లో వసూళ్లను రాబట్టింది “మ్యాడ్”. దీనితో మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రకటనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు మేకర్స్. మ్యాడ్ సినిమా సిక్వెల్ కు “మ్యాడ్ మ్యాక్స్ ” అని నిర్ణయించారు. అలాగే ఈ సినిమాను ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారట. అంతేకాకుండా పార్ట్-1 లో నటించిన నటి నటులతోనే .. సెకండ్ పార్ట్ ను కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
కాగా మ్యాడ్ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇక ముగ్గురు హీరో హీరోయిన్లు కాకుండా.. ఈ సినిమాలో రఘు బాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, ఆంటోని, శ్రీకాంత్ రెడ్డి వంటి పరిచయస్తులు .. ప్రధాన పాత్రలలో నటించారు . అంతే కాకుండా జాతి రత్నాలు సినిమా దర్శకుడు కేవీ అనుదీప్ కూడా.. మంచి రోల్ లో నటించి నవ్వులు పండించారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, హారిక సూర్యదేవర కలిసి నిర్మించారు. ఇక ఇప్పుడు మ్యాడ్ కు సిక్వెల్ గా రాబోయే మ్యాడ్ మ్యాక్స్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి, మ్యాడ్ మ్యాక్స్ సినిమా అప్ డేట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.