Kriti Sanon: నేనలా మాట్లాడలేదు.. ఆ వార్తలపై చర్యలు తీసుకున్నా: కృతీ

కృతిసనన్ ఈ విషయంపైన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆ కథనాలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు..

కృతిసనన్ ఈ విషయంపైన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆ కథనాలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది ‍కృతీ సనన్‌. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో కృతీ సనన్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుస ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే, నటి కృతి సనన్ ట్రేడింగ్ మీడియాకు సహకరిస్తుందని,

వాటి మద్దతుగా మాట్లాడిందని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై కృతీ సనన్‌ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీని పోస్ట్ చేశారు. తాను అలా మాట్లాడలేదని అందరికీ ఓ క్లారిటీ ఇచ్చారు. “కొన్ని మీడియా ప్లాట్ ఫామ్‌లు నేను ట్రేడింగ్‌ మాధ్యమాలకు మద్దతుగా మాట్లాడానని కొన్ని వార్తల్ని ప్రచారం చేశాయి. ఆ కథనాలు పూర్తిగా అవాస్తవం. అందులో.. ట్రేడింగ్‌ మాధ్యమాలతో నాకు అనుబంధం ఉందని రాశారు.

నేను ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు, నివేదికలపై నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నాను. లీగల్‌ నోటీసులు జారీ చేశాను. ఇలాంటి తప్పుడు రిపోర్టుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇక కృతి సనన్‌ సినిమాల విషయాని కొస్తే ..ఈ ఏడాది ‘మీమీ’ చిత్రంలో తన నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సంపాదించింది.  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన.. మైథలాజికల్ సినిమా ‘ఆదిపురుష్’ లో జానకి పాత్రతో కృతి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆదిపురుష్‌ తర్వాత ‘గణపథ్‌: ఎ హీరో ఈజ్‌ బోర్న్‌’ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్‌లో మూడు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. వీటిలో ‘దో పత్తి’ అనే చిత్రానికి కృతి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో ఈ భామ బిజీగా ఉంది. ఏదేమైనా ఇండస్ట్రీలో ఉన్న నటీ నటులు సరదాగా దేనిగురించైనా మాట్లాడినా సరే.. ఒక్కోసారి అవి సోషల్ మీడియాలో తప్పుడు కథనాలుగా ట్రోల్ అవుతూ ఉంటాయి. ఏది వాస్తవం అనేది మరలా వాళ్ళే స్పష్టత ఇవ్వాల్సి వస్తుంది. మరి, కృతి ట్రేడింగ్ మాధ్యమాలకు సహకరిస్తోందని వచ్చిన పుకార్లకు.. ఆమె స్పదించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments