Heroine who became beggar after her films flopped: హీరోయిన్ కాస్త బిచ్చగత్తెగా మారి! పాపం ఓ అభాగ్యురాలి కథ!

హీరోయిన్ కాస్త బిచ్చగత్తెగా మారి! పాపం ఓ అభాగ్యురాలి కథ!

సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో కొందరు రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్నారు. గతంలో టిక్ టాక్ వీడియోలు, ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిపోవాలని అనుకుంటుంటారు.

సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో కొందరు రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్నారు. గతంలో టిక్ టాక్ వీడియోలు, ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిపోవాలని అనుకుంటుంటారు.

సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో కొందరు రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్నారు. గతంలో టిక్ టాక్ వీడియోలు, ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిపోవాలని అనుకుంటుంటారు. కానీ, కొందరికి అదృష్టం కలిసి రావడంతో తక్కువ సమయంలోనే సినిమాల్లో అవకాశాలు వచ్చి హీరోయిన్ గా మారిపోతున్నారు. ఇలా ఎంతో మంది ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రాణిస్తూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ లుగా చలామణి అవుతున్నారు. అయితే అచ్చం ఇలాగే హీరోయిన్ అవ్వాలనుకున్న ఓ యువతి.. ఇంట్లో తల్లిదండ్రులను ఎదురించి ముంబైకి చేరుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత హీరోయిన్ గా మారి సినిమాల్లో కూడా రాణించింది. ఇప్పుడు అదే హీరోయిన్ జైల్లో ఊచలు లెక్కపెడుతుంది. గతంలో నటిగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు జైలుకు వెళ్లడానికి కారణం ఏంటి? ఈ హీరోయిన్ పడ్డ కష్టాలు ఏంటి? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలసుకుందాం.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మకు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనే కోరిక బలంగా ఉండేది. ఇందు కోసం సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆఫీసుల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగింది. ఈ క్రమంలోనే ఆమెకు కొన్ని చిత్రాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. దీంతో కూతురి కష్టాలు చూడలేక ఆమె తల్లిదండ్రులు వద్దని సర్ది చెప్పారు. కానీ, ఇవేం పట్టించుకోని మిథాలీ శర్మ.. తల్లిదండ్రులను ఎదురించి మరీ ఇంట్లో నుంచి బయటకొచ్చింది. ఆ తర్వాత తనకున్న టాలెంట్ తో చాలా సినిమాల్లో నటించింది.

కానీ, మొదట్లో అదృష్టం వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. దీంతో అవకాశాలు రాకపోవడంతో ఈ యువతి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. ఇక రాను రాను చేతిలో చిల్ల గవ్వ లేకపోవడంతో చివరికి ఒక్కప్పటి హీరోయిన్ ఇప్పుడు బిచ్చగత్తెగా మారింది. రోడ్లపై ఎక్కడి పడితే అక్కడ బిక్షాటన చేస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే.. మిథాలీ శర్మ ఇటీవల ఓ చోరీకి పాల్పడింది. ఈ కేసులో భాగంగానే పోలీసులు తాజాగా ఆమెను అరెస్ట్ చేశారు. గతంలో హీరోయిన్ గా చలామణి అయిన మిథాలీ శర్మ.. ఇప్పుడు డబ్బులు లేక చోరీకి పాల్పడింది. ఈమె కష్టాలు విన్న అందరూ కంటతడి పెడుతున్నారు.

Show comments