బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఇంట మోగిన పెళ్లి బాజాలు.. ఫోటోలు వైరల్!

  • Author Soma Sekhar Published - 06:05 PM, Sat - 8 July 23
  • Author Soma Sekhar Published - 06:05 PM, Sat - 8 July 23
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఇంట మోగిన పెళ్లి బాజాలు.. ఫోటోలు వైరల్!

మెహబూబ్.. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ లోకి రాకముందు.. టిక్ టాక్ వీడియోస్ తో పాటుగా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియో సాంగ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక మెహబూబ్ క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఈ క్రేజ్ ద్వారానే బుల్లితెరపై పలు షోల్లో మెరుస్తున్నాడు ఈ నటుడు. తాజాగా అతడి ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియపరిచాడు అతడు.

మెహబూబ్ దిల్ సే.. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ను బాగానే యూజ్ చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ తర్వాతనే తన సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. అదీకాక ఓ లగ్జరీ కారును సైతం కొనుగోలు చేశాడు. ఇక తన కెరీర్ కు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు. తాజాగా తన ఇంట్లో జరిగిన ఓ శుభకార్యం గురించి అభిమానులతో పంచుకున్నాడు. మెహబూబ్ తమ్ముడు సుభాష్ షేక్ వివాహం గ్రాండ్ గా జరిగింది.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేశాడు మెహబూబ్. “నిఖా ముబారక్ మేరా భాయ్.. నీ కలలు అన్ని సాకారం కావాలని, ఆ అల్లా మీ ఇద్దరిని ఎప్పుడూ కలిసి ఉంచాలని, ఎప్పుడూ ఓర్పు, సహనంతో.. కలిసి మెలసి ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అంటూ తన తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారడంతో.. అతడికి అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Show comments