Venkateswarlu
యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి ప్రేక్షకులతో పాటు, రివ్యూవర్స్ దగ్గరినుంచి మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు మంచి వసూళ్లు సాధించింది.
యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి ప్రేక్షకులతో పాటు, రివ్యూవర్స్ దగ్గరినుంచి మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు మంచి వసూళ్లు సాధించింది.
Venkateswarlu
భారీ అంచనాల నడుమన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లను కూడా మెప్పించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 116 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దేశ వ్యాప్తంగా 71 కోట్ల రూపాయలు రాగా.. ఓవర్‌సీస్‌లో 45 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.
రెండవ రోజు కూడా యానిమల్ తన సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా 61 కోట్ల రూపాయలు.. ప్రపంచ వ్యాప్తంగా 129 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. రెండు రోజుల్లోనే 230 కోట్ల మార్కును చేరుకుంది. మూడవ రోజు కూడా యానిమల్ కలెక్షన్ల పంట పండించింది. దాదాపు 130 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. మూడు రోజుల్లోనే 356 కోట్ల రూపాయల వసూళ్లను కొల్లగొట్టింది. పాత రికార్డులను తిరగసారింది. రణబీర్ కపూర్ కెరీర్‌లోనే యానిమల్ మైలు రాయి సినిమా నిలిచింది.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్, జవాన్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా.. ముఖ్యంగా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా నిలిచాయి. పఠాన్ హిందీ వర్షన్ 3 రోజుల్లో.. 161 కోట్ల వసూళ్లు సాధించింది. జవాన్ 180 కోట్ల వసూళ్లు తెచ్చుకుంది. యానిమల్ పఠాన్ రికార్డును బ్రేక్ చేసింది. యానిమల్ హిందీ వర్షన్‌కు మూడు రోజుల్లో 161 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. డిసెంబర్ 1వ తేదీ శుక్రవారం నాడు 54.75 కోట్ల రూపాయలు.. శనివారం 58.37 కోట్ల రూపాయలు..
ఆదివారం ఏకంగా 63.46 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సౌత్ విషయానికి వస్తే.. శుక్రవారం 9.05 కోట్ల రూపాయలు.. శనివారం 8.90 కోట్ల రూపాయలు.. ఆదివారం 7.23 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. పఠాన్, జవాన్‌తో పోల్చుకుంటే.. యానిమల్‌కు థియేటర్లు తక్కువ లభించాయి. దానికి తోడు ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ రెండూ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
కాగా, యానిమల్ సినిమా థియేట్రికల్, ఓటీటీ రైట్స్ ద్వారా భారీ మొత్తాన్నే అందుకుంది. ఇక, ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 6-7 వారాల తర్వాత ఓటీటీకి రానుంది. యానిమల్ థియేటర్‌లో 3:21 నిమిషాల నిడివితో విడుదల అయింది. కానీ, ఓటీటీలో మాత్రం అరగంట ఎక్కువ నిడివితో స్ట్రీమింగ్ అవ్వనుంది. యానిమల్ అభిమానులకు సంతోషకరమైన వార్త ఏంటంటే.. ఈ మూవీకి సీక్వెల్ ఉండటం. మరి, యానిమల్ 3 రోజుల్లోనే షారుఖ్ రికార్డును తుడిచిపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
TSUNAMI – HURRICANE – TYPHOON… ‘ANIMAL’ HAS HISTORIC WEEKEND…#Animal packs a BLOCKBUSTER TOTAL in its opening weekend, despite ‘A’ certification… Fri 54.75 cr, Sat 58.37 cr, Sun 63.46 cr. Total: ₹ 176.58 cr. #Hindi version. Nett BOC. #Boxoffice#Pathaan vs #Jawan vs #Animal… pic.twitter.com/mj4Sh91hh6
— taran adarsh (@taran_adarsh) December 4, 2023