Pushpa 2 Movie: పుష్ఫ 2 నుండి ఫస్ట్ సింగిల్.. మాస్ జాతర ఖాయం

చివరి దశలో పుష్ప టీంకి షాకిచ్చిన స్టార్ ఎడిటర్!

బన్నీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2. అల్లు అర్జున్ ను తెరపై చూసి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సమయంలో..

బన్నీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2. అల్లు అర్జున్ ను తెరపై చూసి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సమయంలో..

అల్లు అర్జున్- లెక్కల మాస్టారు సుకుమార్ కాంబోలో రాబోతున్న చిత్రం పుష్ప 2. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు రష్మిక, పహాద్ ఫజిల్ అభిమానులు కూడా ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ. కాగా, ఈ సినిమా ఇంకా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆగస్టు 15న ఈ మూవీని విడుదల చేయాలన్న గట్టిగా ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకోకపోవడంపై కాస్త ఆందోళన నెలకొంది. వచ్చే నెల నుండి పహాద్ ఫజిల్‌పై సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నవీన్ ఏర్నేనీ, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్‌కు మరో ఝలక్ తగిలింది.

షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో క్రూలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సినిమా నుండి ఎడిటర్ ఆంటోనీ రూబెన్స్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప.. ది రైజ్, జవాన్, బిగిల్, మెర్సల్, వివేకం వంటి హిట్ చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశాడు ఈ స్టార్ ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలకు ఎడిటింగ్ చేస్తున్నాడు రూబెన్స్. ప్రస్తుతం అనేక సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో డేట్స్ సర్దుబాటు చేయలేక.. మొత్తానికి ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ మూవీ బేబీ జాన్ మూవీ కోసం వర్క్ చేస్తున్నాడు ఈ ఎడిటర్. అలాగే అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇవే కాకుండా పలు సినిమాలకు కమిట్ అవ్వడంతో డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక.. పుష్ప 2 నుండి స్నేహ పూర్వకంగానే వైదొలిగినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుండి రూబెన్స్ వెళ్లిపోవడంతో మరొకరి కోసం వెతికే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పటికే కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నప్పటికీ.. మేజర్ ఎడిటర్ కోసం నవీన్ నూలిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. జెర్సీ మూవీకి ఎడిటింగ్ కేటగిరీలో ఉత్తమ జాతీయ అవార్డును అందుకున్న నవీన్ నూలిని తీసుకు రావాలనుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్. గతంలో సుకుమార్‌తో నవీన్ నూలికి పనిచేసిన అనుభవం ఉంది. గతంలో సుకుమార్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో (2016), రామ్ చరణ్ నటించిన రంగస్థలం (2018) చిత్రాలకు పనిచేశాడు. అలాగే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. అలా వైకుంఠపురంలో మూవీకి కూడా పని చేశాడు నవీన్. ప్రస్తుతం పవన్ ఓజీతో పాటు నాలుగు చిత్రాలకు కమిట్ అయ్యాడు.

Show comments