Nidhan
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉండేదామె. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. కానీ ఈ మధ్య కాలంలో ఆఫర్లు లేక వెండితెరపై కనిపించడం లేదు. ఊసే లేకుండా పోయిన ఆ నటి ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉండేదామె. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. కానీ ఈ మధ్య కాలంలో ఆఫర్లు లేక వెండితెరపై కనిపించడం లేదు. ఊసే లేకుండా పోయిన ఆ నటి ఎవరో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఫిల్మ్ ఇండస్ట్రీలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను బాగా వాడుతుంటారు. ఇక్కడ హిట్లు ఉన్నన్ని రోజులే ఎవరికైనా నేమ్, ఫేమ్, క్రేజ్ ఉంటుంది. ఒక్కసారి పరాజయాల బాట పట్టారా తర్వాత పట్టించుకునే వారే ఉండరు. అందుకే మంచి క్రేజ్ ఉన్నప్పుడే రెగ్యులర్ సినిమాలతో పాటు మంచి చిత్రాలు కూడా చేస్తూ అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి. చిత్ర పరిశ్రమలో హీరోలకు లాంగ్ కెరీర్ ఉంటుంది. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం కెరీర్ స్పాన్ చాలా తక్కువ. అయితే ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా రాణిస్తున్నారు. కానీ తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఆమెకు మాత్రం ఇప్పుడు ఆఫర్లు లేకుండా పోయాయి. తమిళంతో పాటు తెలుగు, మలయాళ మూవీస్‌లో కూడా టాప్ హీరోస్ సరసన హీరోయిన్గా నటించిందామె. ఎంతో ఫేమ్ అందుకున్న ఆ నటి కొన్నాళ్లుగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం లేదు.
హీరోయిన్గా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిన ఆ నటి మరెవరో కాదు.. సుకన్య. అయితే కొన్నాళ్ల తర్వాత కెరీర్లో వెనుకబడిందామె. ఆ టైమ్‌లో లైఫ్‌లో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొంది. శ్రీధర్ రాజగోపాలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని యూఎస్‌లో సెటిల్ అయింది. అయితే ఏడాదికే 2003లో అతడికి డివోర్స్ ఇచ్చేసింది. అయినా తనకు ఎంతో ఇష్టమైన నటనను మాత్రం వదల్లేదు. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అలాగే కొన్ని టీవీ షోస్‌లోనూ మెరిసింది. అయితే ఇప్పుడు ఛాన్సుల్లేక ఓ సీరియల్లో యాక్ట్ చేస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు అవకాశాలు లేక సీరియల్స్ చేస్తుండటంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. దీనిపై స్వయంగా సుకన్య రియాక్ట్ అయింది. తాను మూవీస్‌కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని తెలిపింది.
‘నేను సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోలేదు. మూవీస్ వల్లే నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. పలు భాషల్లో యాక్ట్ చేయడం వల్లే ఎన్నో అవార్డులు అందుకున్నా. అయితే నాకు ఇప్పుడు సినిమా ఆఫర్లు రావడం లేదు. నన్ను ఎవరూ పిలవడం లేదు. మంచి అవకాశం ఇస్తే మళ్లీ మూవీస్‌లో యాక్ట్ చేసేందుకు నేను రెడీగా ఉన్నా’ అని సుకన్య స్పష్టం చేసింది. ఇక, తెలుగులో చాలా చిత్రాల్లో యాక్ట్ చేసింది సుకన్య. ‘శ్రీ’, ‘మున్నా’, ‘అభిమన్యుడు’, ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాల్లో ఆమె తనదైన నటనతో మెప్పించింది. ఇందులో ‘శ్రీమంతుడు’ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అందులో మహేష్ బాబుకు తల్లిగా నటించారామె. మరి.. సుకన్య సినిమాల నుంచి సీరియల్స్ వైపు టర్న్ తీసుకోవడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో MS ధోనీ?