Actress Smriti Biswas: చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Actress Smriti Biswas: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.

Actress Smriti Biswas: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.

ఇటీవల పలు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రముఖ నటీనటులు,  దర్శక, నిర్మాతలు, సింగర్స్, రైటర్స్ తో పాటు టెక్నికల్ రంగానికి చెందిన వారు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది స్టార్  ప్రముఖ సినీ రచయిత శ్రీ రామకృష్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీర భద్రరావు, కమెడియన్లుగా పేరు తెచ్చుకున్నలొల్లు సభ శేషు, గరిమెళ్ల విశ్వేశ్వరరావు, తమిళ, తెలుగు చిత్రాల్లో  విలన్ మెప్పించిన డేనియల్ బాలాజీ ఇలా వరుసగా కన్నుమూశారు. ఈ మధ్యనే ప్రముఖ హీరోయిన్ అమృత పాండే, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సింగర్ సింగ్ ఉమా రామనన్ కన్నుమూశారు. ఈ విషాదాలు మర్చిపోక ముందే ప్రముఖ నటి ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నటి స్మృతి బిశ్వాస్ (100) మహారాష్ట్రలోని నాసిక్ లో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె వృద్దాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జులై 3న కన్నుమూశారు. స్మృతి బిశ్వాస్ హింది, మరాఠి, బెంగాలీ భాషల్లో నటించారు. స్మృతి బిశ్వాస్ 1930 నుండి 1960 వరకు మూడు దశాబ్దాల పాటు ‘నేక్ దిల్’, ‘అపరాజిత’, ‘మోడరన్ గర్ల్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. రాజ్ కపూర్, కిషోర్ కుమార్, భగవందాదా, నర్గీస్, బల్ రాజ్ సాహ్ని వంటి నటులతో దాదాపు 90 చిత్రాలలో స్మృతి బిస్వాస్ నటించింది.కెరీర్ లో ఆమె ఎన్నో అవార్డులు, రివార్డులతో సత్కరించబడ్డాడు.

ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే గోల్డెన్ ఎరా’ అవార్డుతో సత్కరించారు. స్మృతి బిస్వాస్ భర్త నారంగ్ డా ఎస్‌డి నారంగ్ అలియాస్ రాజా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు. అతను 25 జనవరి 1986న అనారోగ్య సమస్యలతో మరణించాడు. భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న ఆమె నాసిక్‌లోని ఓ చిన్న ఇంట్లో ఉండేవారు. 28 ఏళ్ల క్రితం ఊరు మారిన స్మృతి బిస్వాస్ క్రిస్టియన్ మిషనరీగా పనిచేస్తున్న తన సోదరి ఆధ్వర్యంలో ముంబై నుంచి నాసిక్‌లో స్థిరపడింది. ఆమె మృతికి చిత్ర నిర్మాత హన్సల్ మెహతా ఇన్‌స్టాగ్రామ్‌లో సంతాపం తెలిపారు.

 

Show comments