థియేటర్ లో చిన్న సినిమాల హవా.. టాలీవుడ్ కు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్లేనా!

Aay,committee kurrollu, Maruthi Nagar Subramanyam Movies: ఈ నెలలో థియేటర్ లో స్టార్ హీరోల సినిమాలు , చిన్న సినిమాలతో కలిపి చాలానే ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఇప్పుడు చిన్న సినిమాలు కంటెంట్ కు ఉండే సత్తా ఏంటో చూపిస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

Aay,committee kurrollu, Maruthi Nagar Subramanyam Movies: ఈ నెలలో థియేటర్ లో స్టార్ హీరోల సినిమాలు , చిన్న సినిమాలతో కలిపి చాలానే ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఇప్పుడు చిన్న సినిమాలు కంటెంట్ కు ఉండే సత్తా ఏంటో చూపిస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

ఒకప్పుడు మాస్ యాక్షన్ సీన్స్, డ్రామాస్ , సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండే మూవీస్ ను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించే వారు. కొంతకాలం అదే ట్రెండ్ కొనసాగింది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు మారారు.. ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు మారింది. అలాంటి మాస్ ఎలిమెంట్స్ ఉండే యాక్షన్ సీన్స్.. వారికి రొటీన్ అయిపోయాయి. సినిమాలో స్టార్ యాక్టర్స్ ఉన్నారా.. భారీ బడ్జెట్ కేటాయించారా అని చూడడం కంటే.. కథలో వారికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా.. కథలో కంటెంట్ ఉందా లేదా అనే దానిపై మాత్రమే.. ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో చిన్న సినిమాలు.. తమ సత్తా ఏంటో చూపించాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఈ నెలలో రిలీజ్ అయినా మూడు చిన్న సినిమాలు యాడ్ అయిపోయాయి. వాటికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

కమిటీ కుర్రాళ్ళు.. 11మంది హీరోలు, కొత్త నటి నటులు , కొత్త దర్శకుడు.. అసలు ఇలాంటి సినిమాల మీద ఏ ఒక్కరికి ఎలాంటి అంచనాలు ఉండవు. కానీ ఆగస్ట్ 9న థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా.. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుని నోస్టాలాజిక్ బ్లాక్ బస్టర్ గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత వారం పెద్ద సినిమాలు రిలీజ్ అయినా.. ఇప్పటికి బాక్స్ ఆఫీస్ దగ్గర అదే హోల్డ్ ను కనబరుస్తుంది. ఇక ఆ తర్వాత వారం ఆగష్టు 15న మూడు పెద్ద సినిమాల మధ్యలో.. రిలీజ్ అయినా సినిమా.. నితిన్ నార్నె నటించిన ఆయ్. పెద్ద సినిమాల మధ్యన రిలీజ్ చేస్తూ నితిన్ సాహసం చేస్తున్నాడని అన్నారు కానీ.. నిజానికి కథపై ఉన్న నమ్మకమే వారికీ ఈ రోజు ఊహించని సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఇక ఆగస్టు 23న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే మూవీ థియేటర్స్ లో అడుగుపెట్టింది. గత రెండు వారాలుగా థియేటర్స్ లో చిన్న సినిమాలు హావ కొనసాగడంతో.. ఈ సినిమాపై కూడా డీసెంట్ హైప్ కొనసాగింది. అలాగే రిలీజ్ తర్వాత కూడా ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ బజ్ తోనే కొనసాగుతుంది. మరి లాంగ్ రన్ లో కమిటీ కుర్రాళ్ళు, ఆయ్ సినిమాలలనే.. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సో ఈ లెక్కన చూస్తే.. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినా ఈ సినిమాలు.. టాలీవుడ్ దర్శకులకు కథల పరంగా చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్లేనా అని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఇదే సమయంలో భారీ అంచనాల మధ్యన , స్టార్ క్యాస్టింగ్ తో రిలీజ్ అయినా డబుల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ సినిమాలు.. రిలీజ్ తర్వాత ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీనితో అందరి అడుగులు ఈ సినిమాలవైపు కదిలి.. క్రమంగా స్క్రీన్స్ , కలెక్షన్స్ పెరుగుతున్నాయి. దీనిని బట్టి సరైన కథ లేకుండా.. స్టార్ క్యాస్టింగ్, భారీ బడ్జెట్ తో సినిమాలను తీయడం కంటే.. బలమైన కంటెంట్ తో రూపొందిస్తే.. ఆటోమాటిక్ గా క్రేజ్ అదే వస్తుందని మరోసారి నిరూపించాయి ఈ సినిమాలు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments