Krishna Kowshik
90వ దశకంలో తన గ్లామరస్, బోల్డ్ ఫోటో షూట్ తో ఇండస్ట్రీని షేక్ చేసేసింది. కానీ చిన్న ఆరోపణ ఆమెను ఇండస్ట్రీలో లేకుండా చేసింది. చివరకు యోగినిగా కూడా మారింది. అలాగే డ్రగ్ కేసులో కూడా బాధితురాలయ్యింది.
90వ దశకంలో తన గ్లామరస్, బోల్డ్ ఫోటో షూట్ తో ఇండస్ట్రీని షేక్ చేసేసింది. కానీ చిన్న ఆరోపణ ఆమెను ఇండస్ట్రీలో లేకుండా చేసింది. చివరకు యోగినిగా కూడా మారింది. అలాగే డ్రగ్ కేసులో కూడా బాధితురాలయ్యింది.
Krishna Kowshik
గ్లామర్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఫేమ్ తెచ్చుకుంటారో.. ఎప్పుడు కెరీర్ చతికిలబడుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ చూస్తుంటారు. వరుసగా ఆఫర్లు, స్టార్ హీరోలతో రొమాన్స్, అభిమానుల చూపించే ప్రేమతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. అలాగే ఉన్నపళంగా కనుమరుగు అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఏమయ్యారు.. ఎక్కడున్నారు అనేది సినీ పరిశ్రమ మర్చిపోతూ ఉంటుంది. ఆమె నటనతో ఫిదా అయిన ప్రేక్షకులు మాత్రం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏమైందా అని ఆరా తీస్తుంటారు. ఇదిగో ఈ బ్యూటీ కూడా ఆ కోవకే వస్తుంది. గ్లామరస్ పాత్రలు, బోల్డ్ ఫోటో షూట్లతో కుర్రకారు నిద్రలేకుండా చేసిన ఆమె ఒక్క పొరపాటు పతనానికి దారి తీసింది.
స్టార్ హీరోయిన్ల సరసన ఆడిపాడిన ఆమె.. దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీని అలరించి, తెరమరుగైంది. బాలీవుడ్ ఇండస్ట్రీని తన అందచందాలతో ఊపేసిన ఈ బ్యూటీ చివరకు యోగినిగా మారింది. తెలుగులో కూడా ఆమె సినిమాలు చేసింది. మోహన్ బాబు, ప్రశాంత్ వంటి హీరోలతో నటించింది. కానీ చిన్న కాంట్రవర్సీ వల్ల కెరీర్ నాశమైంది. ఇంతకు ఆమె ఎవరు అంటే.. ద బ్యూటీఫుల్ హీరోయిన్ మమతా కులకర్ణి. 90వ దశకంలో ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్ అయిపోయింది. 1991లో నన్ బర్గల్ అనే తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మమతా.. హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1992లో తిరంగా, మేరీ దిల్ తేరే లియా వంటి చిత్రాలు చేసింది. ఆషిక్ అవారాతో తనదైన ముద్ర వేసుకుంది.
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మూవీ కరణ్ అర్జున్, సన్నీడియోలో ఘటక్ వంటి హిట్ చిత్రాలతో ఆమె కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. అప్పటికే తెలుగులో మోహన్ బాబు సరసన దొంగ పోలీస్, ప్రశాంత్ హీరోగా బైలింగ్వల్ మూవీ ప్రేమ శిఖరంలో నటించింది. అయితే 1993లో స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్ పై టాపె లెస్ ఫోజులిచ్చి.. వివాదాన్ని కొని తెచ్చుకుంది. అయితే దాని వల్ల అవకాశాలు పెరిగాయి కానీ తగ్గలేదు. వరుస పెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే ఆమె పతనానికి కారణమైంది.. చైనా గేట్ మూవీ. ఈ సినిమాకు రాజ్ కుమార్ సంతోషి దర్శక నిర్మాత. ఈ సినిమా విడుదల తర్వాత రాజ్ కుమార్ పై మమతా తీవ్ర ఆరోపణలు చేసింది. తన స్క్రీన్ స్పేస్ తగ్గించేశాడని,అతడి నెక్ట్ సినిమాకు అడ్వాన్సులు తీసుకోనందుకు పగబట్టి ఇలా చేశాడని చెప్పగా.. నిర్మాత ఖండించాడు.
కానీ ఆ తర్వాత కేవలం ఐదంటే ఐదు సినిమాలు మాత్రమే చేసింది. ఆఫర్లు కరువయ్యాయి. చివరకు బెంగాలీ చిత్రంలో కనిపించి నటనకు స్వస్థి చెప్పింది. 2010లో అనూహ్యంగా తాను యోగిగా మారానంటూ ప్రకటించింది. ఆమె జీవితం ఆధారంగా ఓ పుస్తకాన్ని రచించింది. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగిని అనే పుస్తకాన్ని రచించింది. కాగా, 2013లో, డ్రగ్స్ వ్యాపారి అయిన విక్కీ గోస్వామిని వివాహం చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. తరువాత, 2016లో రూ. 2000 కోట్ల అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌లో మమతా సహ నిందితురాలిగా పేర్కొన్నారు పోలీసులు. అయితే అవి నిజ నిర్దారణ కాకపోవడంతో కోర్టు ఆ కేసును కొట్టేసింది.