ఐఫోన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్నవారు. ఆఖరికి హత్యలు చేసిన వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. కొత్త సిరీస్ మార్కెట్‌లోకి వస్తే చాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. తాజాగా, ఐఫోన్ 15 సిరీస్ అందుబాటులోకి వచ్చింది. పలు దేశాల్లో అమ్మకాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని యాపిల్ ఫోన్లు అమ్మే స్టోర్‌లలో లూటీ జరిగింది. దాదాపు 20 మంది టీనేజన్లు షాపుల్లోకి చొరబడి అలజడి సృష్టించారు.
క్షణాల్లో షాపులను ఖాళీ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికా, ఫిలడెల్ఫియాలో మంగళవారం రాత్రి కొందరు టీనేజర్లు లూటీలకు పాల్పడ్డారు. యాపిల్ స్టోర్‌తోపాటు పలు షాపుల్లో దొంగతనాలు చేశారు. అందరూ చూస్తుండగానే షాపులోని ఐఫోన్లను, ఇతర ఐఫోన్ వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు లూటీలో పాల్గొన్న 20 మందిని అరెస్ట్ చేశారు. వారినుంచి వస్తువులను రికవరీ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.