ఆడవాళ్లంటే చచ్చేంత భయం.. 55 ఏళ్లుగా..

దీన్ని వైద్య పరిభాషలో గైనో ఫోబియా అంటారు. ఈ ఫోబియా కారణంగా అతడు ఆడవాళ్లకు దూరంగా ఉండాలని గట్టిగా డిసైడ్‌ అయ్యాడు. ఇంట్లో తనను తాను బంధీ చేసుకున్నాడు.

దీన్ని వైద్య పరిభాషలో గైనో ఫోబియా అంటారు. ఈ ఫోబియా కారణంగా అతడు ఆడవాళ్లకు దూరంగా ఉండాలని గట్టిగా డిసైడ్‌ అయ్యాడు. ఇంట్లో తనను తాను బంధీ చేసుకున్నాడు.

ఈ ప్రపంచంలో వింత వింత జంతువులే కాదు.. వింత వింత మనుషులు కూడా ఉన్నారు. వారికున్న భయాల కారణంగా ప్రపంచమే వారి వైపు తిరిగి చూసేలా చేసుకుంటున్నారు. ఇందుకు ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి ప్రత్యక్ష ఉదాహరణ. ఆ వ్యక్తికి ఆడవాళ్లంటే చచ్చేంత భయం. ఆ భయం కారణంగా అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాదాపు 55 ఏళ్లుగా ఓ చిన్న ఇంట్లో బంధీ అయి జీవిస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికాలోని రవాండాకు చెందిన కలిక్ట్స్‌ జాంబితా అనే వ్యక్తికి ఆడవాళ్లంటే భయం.

దీన్ని వైద్య పరిభాషలో గైనో ఫోబియా అంటారు. ఈ ఫోబియా కారణంగా అతడు ఆడవాళ్లకు దూరంగా ఉండాలని గట్టిగా డిసైడ్‌ అయ్యాడు. ఇంట్లో తనను తాను బంధీ చేసుకున్నాడు. ఇంటి చుట్టూ ఏకంగా 15 అడుగుల కంచె నిర్మించుకున్నాడు. అందులోనే ఉండిపోయాడు. కేవలం ఒకే గది కలిగిన ఆ ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు. అలాగని అతడు ఆడవాళ్లకు పూర్తిగా దూరం వచ్చేయలేదు. ఆడవాళ్లను తన దగ్గరకు రానీయకుండా.. తను ఆడవాళ్ల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నాడు. అతడు దాదాపు 55 ఏళ్లుగా ఇలా ఆడవాళ్లకు దూరంగా నివసిస్తూ ఉన్నాడు.

గత ఆగస్టు నెలలో ఇతడి గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ మొత్తం ఫేమస్‌ అయిపోయాడు. దీనిపై కలిక్ట్స్‌ జాంబితా మాట్లాడుతూ.. ‘‘ ఆడవాళ్లకు దూరంగా ఉండటానికి నేను గదిలో నన్ను నేను బంధించుకున్నాను. నా చుట్టు ప్రక్కల ఆడవాళ్లు ఉండాలని నేను కోరుకోను. ఎందుకంటే.. వాళ్లను చూస్తే నాకు భయం వేస్తుంది’’ అని అన్నాడు. మరి, ఆడవాళ్లకు భయపడి 55 ఏళ్లుగా హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిన కలిక్ట్స్‌ జాంబితాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments