ఈ నాణెం విలువ 100 కోట్లు పైనే.. ఎందుకంత ఖరీదంటే..

అవును.. మీరు చదవింది అక్షర సత్యం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలోని నాణెం ధర 100 కోట్ల రూపాయలకు పైమాటే. అంత ధర ఎందుకా అనుకుంటున్నారా? ఆ నాణెం బంగారం, వజ్రాలతో తయారు చేశారు. ఎంత బంగారం, వజ్రాలతో చేస్తే మాత్రం అన్ని కోట్లా అనుకోవచ్చు. ఆ నాణేన్ని ఎందుకు తయారు చేశారు? ఏ విధంగా తయారు చేశారు? అన్న వివరాలు తెలిస్తే గానీ, దానికున్న అసలు విలువ గురించి తెలీదు. ఆ నాణెం గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

లండన్‌ రాణి ఎలిజిబెత్‌ 2 స్మారకార్థంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ సంస్థ ఓ అద్భుతమైన నాణేనికి రూపకల్పన చేసింది. ఆ నాణేన్ని ఏకంగా 4 కేజీల బంగారంతో రూపొందించింది. అంతేకాదు! ఆ నాణెంలో కళ్లు బైర్లు కమ్మేలా 6400 వజ్రాలను పొదిగింది. ఇంత భారీగా తయారు చేసిన దీని కోసం పెద్ద మొత్తమే ఖర్చు అయింది. దీని మార్కెట్‌ విలువ 23 మిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో 190 కోట్ల రూపాయలు అన్నమాట. ఎలిజిబెత్‌ 2 మరణించి సంవత్సరం అయిన సందర్భంగా దీన్ని తయారు చేశారు.

ప్రస్తుతం ఈ నాణెం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ నాణెం ధర తెలిసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఎంతైనా లండన్‌ రాణి కోసం కదా.. ఆ మాత్రం ఉండాలంటున్నారు. మరి, లండన్‌ రాణి మొదటి వర్ధంతిని పురస్కరించుకుని 190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. 4 కేజీల బంగారం, 6400 వజ్రాలతో ఓ ఖరీదైన నాణేన్ని తయారు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments