ప్రేమ అని నమ్మిన విద్యాశ్రీ జీవితం విషాదాంతం!

ప్రేమ అని నమ్మిన విద్యాశ్రీ జీవితం విషాదాంతం!

ఒకప్పుడు ప్రేమ అనే పదానికి ఓ విలువ ఉండేది. ప్రేమ అంటే ఓ పవిత్రమైన పదంగా,బంధంగా భావించే వారు. అయితే నేటికాలం యువత ఆ ప్రేమ అనే పదానికి పూర్తి అర్ధం మార్చేస్తున్నారు. ఇలా కొందరు ఉంటే..ప్రేమ పేరుతో మోసం చేసే యువత సంఖ్య బాగా పెరిగి పోయింది. మాయ మాటలతో అమాయకపు యువతులను వలలో వేసుకుంటున్నారు. వారితో అవసరం తీరక ప్రేమ అనే ముసుగు తొలగించి.. వారి అసలు నిజస్వరూపం బయట పెడుతున్నారు. ఈక్రమంలో ప్రేమ పేరుతో మోసపోయిన కొందరు యువతులు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ఆ సమయంలో వారు రాస్తున్న సుసైడ్ లేఖల్లో సంచలన నిజాలు బయట పడుతుంటాయి. తాజాగా కర్ణాటకలో విద్యాశ్రీ అనే మోడల్ కూడా ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యచేసుకుంది. విద్యాశ్రీ విషాదాంతం వెనుకు ఆశ్చర్యం కలిగించే నిజాలు ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు చెందిన విద్యాశ్రీ(26) మోడల్ గా జీవితాన్ని ప్రారంభించింది. ఎంసీఏ పూర్తి చేసిన విద్యాశ్రీ ఒక కంపెనీలు  ఉద్యోగినిగా పని చేసేది. అలానే మోడలింగ్  అనేది ఆమె ప్రవృత్తి. ఇక బసవేశ్వరనగరలో ఒక జిమ్ లో  అక్షయ్(27) అనే యువకుడు ట్రైనర్ గా పని చేస్తున్నాడు. ఫేస్ బుక్ ద్వారా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఇక అక్షయ్.. విద్యాశ్రీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమె నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు.

తన జీవితమే అక్షయ్ కోసం అన్నట్లు విద్యాశ్రీ ఉంది.  ఆమెను అన్ని రకాలుగా ఉపయోగించుకున్న అక్షయ్.. పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర మనస్తాపానికి గురైంది. తన జీవితమే అతడి కోసమని భావించిన దివ్యశ్రీకి.. అక్షయ్ మాటలు సుడిగుండంలోకి నెట్టాయి.  ఆ బాధను దిగమింగలేక జూన్ 21న ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ లేఖతో విద్యాశ్రీ విషాదాంతం వెనుక దాగున్న నిజాలు ఒక్కసారిగా వెలుగు చూడటంతో నివ్వెరపోవడం బెంగళూరు నగరం వంతైంది.

“నేను అక్షయ్ ను ఎంతగానో నమ్మాను. నా జీవితాన్నే ఆయనకు ధారపోశా. ప్రేమను నమ్మి నేను నిండా మునిగా. అందుకే ఇక తనువు చాలిస్తున్నా. మీరెవ్వరూ.. ప్రేమంటూ వెంటపడితే ఎవర్నీ నమ్మొద్దు” అంటూ లేఖ ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఆ యువతిని వంచించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్షయ్ ను పక్కా ఆధారాలతో సోలదేవనహళ్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. విద్యాశ్రీ రాసిన లేఖ ఆధారంగా విచారణ జరిపి నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి..ప్రేమ పేరుతో ఇలా మోసపోయి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అతడితో పరిచయమే ఆమె పాలిట శాపమయ్యిందా?

Show comments