పెళ్లిలో భోజనం సరిపోలేదని యజమాని ఫ్యాక్టరీకే నిప్పంటించిన ఉద్యోగులు!

పెళ్లిల్లో చిన్న చిన్న విషయాలకే తగాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మర్యాదలు జరగలేదని, పంచ భక్ష పరవాన్నలు పెట్టలేదని వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు, వధువు కుటుంబ సభ్యులతో వాదనలు చేస్తూ ఉంటారు. ఇవే గొడవలకు కారణమౌతుంటాయి.

పెళ్లిల్లో చిన్న చిన్న విషయాలకే తగాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మర్యాదలు జరగలేదని, పంచ భక్ష పరవాన్నలు పెట్టలేదని వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు, వధువు కుటుంబ సభ్యులతో వాదనలు చేస్తూ ఉంటారు. ఇవే గొడవలకు కారణమౌతుంటాయి.

పెళ్లి అంటే సందడితో పాటు గొడవలు, అలకలు, కోపతాపాలు ఉంటాయి. మర్యాదలు తక్కువయ్యాయని వరుడు కుటుంబ సభ్యులు.. వధువు కుటుంబ సభ్యులతో వాదిస్తూ ఉంటారు. పెళ్లికి ఏ వంటలు చేయించాలో చెప్పడం దగ్గర నుండి.. ప్రతి విషయంలోనూ ఏదో ఒక వంక వెతుకుతూ ఉంటారు. ఇక సరిగా భోజనం లేకపోతే వీరంగం చేసేస్తుంటారు. పిల్లనిస్తున్నాం కదా అని వధువు తల్లిదండ్రులు కూడా వాటిని భరిస్తూ ఉంటారు. కానీ ఇవి ఒక్కోసారి శృతి మించిపోతుంటాయి. తన్నుకునే వరకు వెళుతుంటాయి. ఇటీవల కాలంలో పెళ్లి ఇళ్లల్లో కొన్ని సంఘటనలు చూస్తుంటే సిల్లీగా అనిపించొచ్చు కానీ.. వారికి మాత్రం అది సీరియస్ మేటరే. పెళ్లిలో పన్నీర్ పెట్టలేదని, రసగుల్లా వడ్డించలేదని మండపంలోనే బంధువులు తన్నుకున్న ఘటనలు  వెలుగులోకి వచ్చాయి.

వెంకీ పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు అవుతుంది ఈ సంఘటనలు చూస్తుంటే. ఇటీవల ఓ పేపర్ కప్ ఫ్యాక్టరీ ఓనర్ పెళ్లి జరుగుతుండగా.. అతడి వివాహంలో భోజనం సరిగ్గా వడ్డించలేదన్న కోపంతో ఫ్యాక్టరీకే నిప్పంటించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భైరోపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణ జైస్వాల్.. రాజ్ అండ్ ప్రిన్స్ ఇండస్ట్రీస్, సిద్ది వినాయక్ డిస్పోజల్ పేరుతో రైలు మిల్లు, పేపర్ కప్పుల తయారీ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. అందులో చాలా మంది పనిచేస్తున్నారు. కాగా, ఇటీవల కృష్ణకు పెళ్లి కుదరగా.. తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులను పెళ్లికి ఆహ్వానించాడు. బుధవారం పెళ్లి జరగ్గా.. ఇంటి పక్కనే ఉన్న మ్యారేజ్ హాలులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ఈ వేడకకు చాలా మంది హాజరయ్యారు. దీంతో ఆహారం సరిపోలేదు. ఆ సమయంలో ముగ్గురు ఫ్యాక్టరీ ఉద్యోగులు రాగా, వారికి సరిపడా ఆహారం లభించలేదు. మద్యం సేవించిన ఆ ముగ్గురు నానా యాగీ చేశారు. వెంటనే కృష్ణ బంధువు పింటూ, మరో అరడజను మంది వారిని పెళ్లి వేడుక నుండి పంపించేశారు. దీన్ని అవమానంగా భావించిన ముగ్గురు ఉద్యోగులు.. ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని నిప్పంటించారు. మంటల్లో ఫ్యాక్టరీ మొత్తం దగ్దమైంది. మంటలు అలముకోవడంతో స్థానికులు చూసి.. అగ్ని మాపక కార్యాలయానికి కాల్ చేశారు. సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫ్యాక్టరీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. భోజనం తగ్గిందన్న కోపంతో తిన్న కంచెంలోనే ఉమ్మేసుకున్నారు ఈ ఉద్యోగులు. వీరి చర్య పట్ల మీకేమనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments