Arjun Suravaram
ప్రముఖ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ను రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా ఆమె ప్రేయసి పవిత్ర గౌడను ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే దర్శన్ ఓ లాజిక్ మిస్సవ్వడం కారణంగానే ఈ చిక్కుల్లో పడ్డారంట.
ప్రముఖ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ను రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా ఆమె ప్రేయసి పవిత్ర గౌడను ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే దర్శన్ ఓ లాజిక్ మిస్సవ్వడం కారణంగానే ఈ చిక్కుల్లో పడ్డారంట.
Arjun Suravaram
కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు. కన్నడ స్టార్ హీరోల్లో దర్శన్ ఒకడు. అలాంటి వ్యక్తి ఇటీవల ఓ హత్య కేసులో నిందితుడిగా మారాడు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియురాలి కోసం ఏకంగా ఓ అభిమానినే హత్య చేయించాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో అనేక మంది అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలోనే దర్శన్ విషయంలో అనేక వ్యక్తమవుతున్నాయి. దర్శన్ ఆ లాజిక్ ఎలా మిస్సయ్యాడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ను రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా ఆమె ప్రేయసి పవిత్ర గౌడను సైతం ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ఘటన శాండిల్ వుడ్ తో పాటు మిగిలిన పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారింది. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 15కు చేరుకుంది. అలానే గురువారం రేణుకస్వామిని చిత్రదుర్గం నుంచి బెంగుళూరుకు తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ కూడా పోలీసులకు లొంగిపోయాడు.
దీంతో ఈ కేసులో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఇలా ఉంటే.. రీల్ లైఫ్‌లో హీరో అయినా దర్శన్ ..రియల్ లైఫ్‌లో విలన్‌గా మారాడు.. ఏకంగా ఈ మర్డర్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ఒక తప్పు చేసి.. దానిని కవర్ చేసుకునేందుకు మరికొన్ని తప్పులు చేసి ఆఖరికి కటకటాల పాలయ్యాడు దర్శన్. తన ప్రేయసి పవిత్రా గౌడ్ ను వేధిస్తున్నాడనే కారణంతో రేణుక స్వామిని దర్శన్ మర్డర్ చేయించాడు. ఈ క్రమంలోనే హత్య చేసిన వారు పట్టుబడితే తాను కూడా దొరికిపోతాను అనే లాజిక్ ఎలా మిస్సయ్యారనే టాక్ వినిపిస్తోంది.
అసలు మ్యాటర్ లో దర్శన్ చేసిన తొలి మిస్టేక్.. పవిత్రగౌడ ను వేధిస్తున్నాడని తెలిసినప్పుడు తానే చర్యలు తీసుకోవాలని అనుకోవడం. ఈ క్రమంలోనే భారీగా డబ్బులు ఇచ్చి పలువురుని పురమాయించడం. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ కమ్ కో యాక్టర్ ప్రదోశ్‌ను సంప్రదించాడు దర్శన్. దీంతో ఈ కేసు మరో టర్న్ తిరిగింది. ఈ కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ప్రదోశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్టు అయ్యారు. మరికొందరు అయ్యే అవకాశం ఉంద .
ఇలా దర్శన్ అరెస్టు కాకుండా ఉండేందు పవిత్ర గౌడ వేధింపుల విషయంలో ఇలా జరిగి ఉంటే.. ఆయన పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేది. మొదటి అంచనా ఏమిటంటే.. పవిత్రగౌడను రేణుకాస్వామి వేధించాడు.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించింది.. కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేస్తే.. అక్కడితో ఈ ఇష్యు అయిపోయింది. అలానే రెండో సినారియో.. పవిత్రగౌడను రేణుకాస్వామి వేధించాడు. ఆమె వెంటనే ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పింది. దర్శన్, పవిత్రా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే…వారు రేణుకా స్వామిని అరెస్ట్ చేసేవారు. అక్కడితో అయిపోయింది.
ఈ రెండింటిలో ఏది జరిగినా దర్శన్ హాయిగా తన సినిమా షూటింగ్ చేసుకునేవారు. కానీ హత్య చేస్తే.. ఏ విధంగానైనా దొరికిపోతాము అనే లాజిక్ ను దర్శన్ ఎలా మిస్సయ్యాడంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. దర్శన్ అత్యుత్సాహం ఆయన కొంపముంచిందనే వాదనలు వినిపిస్తోన్నాయి. తప్పు చేయడమే తప్పు.. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరికొన్ని తప్పులు చేయడం అనేది ఓ ఊబిలో పడినట్టే.. దాని వల్ల అంతకంతకు లోపలికి కూరుకుపోవడమే తప్ప.. బయట పడే చాన్సే ఉండదని అనేక ఘటనలు రుజువు చేశాయి.