3 ఏళ్ళు కలిసి తిరిగాక హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు! పాపం ఆ అబ్బాయి!

3 ఏళ్ళు కలిసి తిరిగాక హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు! పాపం ఆ అబ్బాయి!

మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ప్రియురాలి తండ్రికి తెలిసింది. వెంటనే అతడు ఒప్పుకున్నాడు. దీంతో ప్రియుడు.. తన అమ్మనాన్నలను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు.

మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ప్రియురాలి తండ్రికి తెలిసింది. వెంటనే అతడు ఒప్పుకున్నాడు. దీంతో ప్రియుడు.. తన అమ్మనాన్నలను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు.

తొలి చూపులో ప్రేమలో పడిన వాళ్లు సైతం పెళ్లి చేసుకునేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో కొంత కాలం పాటు జర్నీ చేస్తున్నారు. ఈ మధ్యలో మనస్పర్థలు వస్తే బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నారు. అయితే కొంత మంది మూవ్ ఆన్ అయిపోతే.. మరికొంత మంది మాత్రం ప్రియుడ్ని/ప్రియురాల్ని తలచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలు.. అమ్మాయి తమను కాదంటే సహించలేకపోతున్నారు. ఆమె లేకుండా జీవితాన్ని ఊహించలేకపోతున్నారు. అందుకు ఆమె ఛీ అన్నా, తూ అన్నా వెంటపడుతూ ఉంటారు. కాదంటే కత్తి దూస్తున్న ఘటనలు కూడా చూశాం. అయితే ఈ ప్రియురాలు కాస్త భిన్నం. తనను బెదిరిస్తున్న ప్రియుడిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించిందో ప్రియురాలు.

ఈ ఘటన కర్ణాటకలోని విజయ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ముద్దెబిహాల పట్టణంలో నివసిస్తోంది పరుశురామ్, రేఖ కుటుంబం. వీరి కూతురు ఐశ్వర్య.. రాహుల్ రామన్ గౌడ బిరాదర అనే వ్యక్తిని మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఐశ్వర్య తండ్రికి తెలిసింది. అతడితో పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నాడు కూడా. అయితే ఆమె తండ్రి పరుశురామ్‌తో మాట్లాడేందుకు రాహుల్ తన తల్లిదండ్రులను తీసుకొచ్చి వారి ఇంటికి వెళ్లాడు. అక్కడకు వెళ్లాక లవర్ ప్లేట్ ఫిరాయించింది. అతడిని తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఒక్కసారిగా నిశ్చేష్టుడు అయ్యాడు ప్రియుడు. అతడి క్యారెక్టర్ బాగోలేదని, తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది ప్రియురాలు. దీంతో అతడికి ఒక్కసారిగా మబ్బులు వీడిపోయాయి. ప్రియురాలు హ్యాండ్ ఇచ్చేసరికి అతడికి ఏం చేయాలో తోచలేదు.

మళ్లీ ఐశ్వర్య ఇంటికి వెళ్లి .. తనను పెళ్లి చేసుకోవాలంటూ బతిమాలాడాడు రాహుల్. అయినప్పటికీ ఆమె ససేమీరా అనడంతో.. మన ఇద్దరం దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. కూతురు ఒప్పుకుంటే పెళ్లి చేస్తానని ఐశ్వర్య తండ్రి రాజీ కుదిర్చి వెనక్కి పంపించాడు. అయితే ఇది తేలేలా లేదని మే 27వ తేదీ సోమవారం ఐశ్చర్య ఇంటికి వెళ్లి ఫోటోలు పెడతానని మరోసారి రాహుల్ బెదిరించాడు. అనంతరం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాహుల్ తండ్రి.. మా అబ్బాయిని ఐశ్వర్య, ఆమె పేరెంట్స్ ఇంటికి పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తొలుత మొబైల్ ఫోన్ ఇవ్వాలని రాడ్ తో తలపై కొట్టారని, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపాడు. కాగా, ఐశ్వర్య పేరెంట్స్ చెబుతున్న వాదన మరో రకంగా ఉంది. తమ కుటుంబ సభ్యులను చంపేందుకు వస్తూ వస్తూనే రాహుల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని వచ్చాడని చెబుతున్నారు. ఫోన్ చేసి మీ ఇంటికి వస్తానని చెప్పి. ఇక్కడికి రాగానే పెట్రోల్ తీసుకొచ్చి నిప్పంటించే ప్రయత్నం చేశాడని పరుశురామ్ తెలిపాడు. కానీ పోలీసులు.. అమ్మాయి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాపం.. ప్రేమికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Show comments