పాతబడిన ఇంట్లో బయటపడిన ఐదు అస్థిపంజరాలు! ఏం జరిగిదంటే..

పాతబడిన ఇంట్లో బయటపడిన ఐదు అస్థిపంజరాలు! ఏం జరిగిదంటే..

సమాజంలో అనేక నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని ఘటనల విషయంలో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురవుతుంటారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో సంచలన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

సమాజంలో అనేక నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని ఘటనల విషయంలో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురవుతుంటారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో సంచలన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

సమాజంలో అనేక వింతలు, ఆశ్చర్యాన్ని కలిగించే  ఘటనలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన కొన్ని ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. అలా బయట ప్రపంచానికి తెలిసే లోపు.. చనిపోయిన వారు అస్థి పంజరాలుగా కనిపిస్తుంటారు. కారణం ఏదేమైనప్పటికీ..చాలా కేసులు మిస్టరీగా మిగిలిపోతుంటాయి. తాజాగా కర్ణాటకలో ఒళ్లు గగ్గుర్లు పుట్టించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఒక పాతబడిన ఇంట్లో  అస్థి పంజరాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో  ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనలోని  అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని  ఓ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ ఇంట్లో ఐదు అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. ఆ అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా సమాచారం. ఇక్కడ కుటుంబం ఒంటరిగా ఉండేదని, వీరంతా అనారోగ్య సమస్యలతో సతమతమవుతుండేవారని బంధువులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇక ఇక్కడ కనిపించిన బాధిత కుటుంబ సభ్యులు చివరిసారిగా జూలై 2019లో కనిపించారు. ఆ తర్వాత నుంచి నేటి వరకు ఆ ఇంట్లో ఎవరు తిరిగినట్లు కనిపించలేదని స్థానికులు తెలిపారు. అంతేకాక అప్పటి నుంచి వారు నివాసం ఉన్న ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లోని వారు వెళ్లిపోయారేమో అని భావించినట్లు స్థానికులు తెలిపారు.

అలానే ఆ పాతబడిన ఇంటి ప్రధాన గుమ్మం తలుపు పగిలిపోయి ఉండటాన్ని దాదాపు రెండు నెలల క్రితం స్థానికంగా ఉండే వాళ్లు గుర్తించారు. అయినప్పటికీ స్థానికులు ఎవరూ పోలీసులకు సమాచారం అందించలేదు. అయితే తాజాగా ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. బాధిత ఇంట్లో పలు అనుమానాస్పద అంశాలు, వస్తువులు కనిపించాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ఇంట్లోని ఓ గదిలో నాలుగు అస్థి పంజరాలు, వేరే గదిలో మరో అస్థి పంజరం ఉండటం గమనించారు.

నాలుగు అస్థి పంజరాలు మంచాలపై రెండు, నేలపై రెండు పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచార అందించడంతో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) టీమ్, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ (ఎస్‌ఓసిఓలు)  టీమ్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అంతేకాక ఆ  బృందాలు సాక్ష్యాలను సేకరించాయి. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు. ఇలా ఒకేసారి ఐదు అస్థిపంజరాలు బయటపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరి.. ఈ సంచలన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments