యమహా నుంచి AI సెల్ఫ్ డ్రైవింగ్ బైక్! ఊహకు అందని రేంజ్​లో ఫీచర్స్!

టూవీలర్ మార్కెట్​లో మంచి పేరు గడించింది యమహా. ఈ జపనీస్ కంపెనీ స్పోర్ట్స్, స్టయిలిష్ బైక్స్​ను తయారు చేయడంలో ఎక్స్​పర్ట్ అని చెప్పాలి. అలాంటి సంస్థ నుంచి ఓ సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ రాబోతోంది.

టూవీలర్ మార్కెట్​లో మంచి పేరు గడించింది యమహా. ఈ జపనీస్ కంపెనీ స్పోర్ట్స్, స్టయిలిష్ బైక్స్​ను తయారు చేయడంలో ఎక్స్​పర్ట్ అని చెప్పాలి. అలాంటి సంస్థ నుంచి ఓ సెల్ఫ్ డ్రైవింగ్ బైక్ రాబోతోంది.

టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతుంది. అందులోనూ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక ఇంకా వేగంగా పెరుగుతుంది. మన అందరికీ యమహా కంపెనీ గురించి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్స్ అయినా, స్టయిలిష్ బైక్స్ అయినా యమహా నుండే చాలా రిలీజ్ అవుతాయి. అదే తరహాలో ఇప్పుడు యమహా MOTOROiD అనే కొత్త మోటార్‌సైకిల్‌ని లాంచ్ చేసింది, ఇది అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా వర్క్ అవుతుంది. చూడడానికి ఒక బట్టర్ ఫ్లై లా ఉండే స్టైలిష్ డిజైన్ తో వచ్చిన ఈ బైక్ స్టార్ట్ చెయ్యాలన్నా, కదలాలన్నా అన్ని కూడా మనమ ముట్టుకోకుండా చెయ్యొచ్చు. అసలు ఈ బైక్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

MOTOROiD తన రైడర్‌ను కెమెరా ఇంకా సెన్సర్లు హెల్ప్ ద్వారా రికగ్నైస్ చేస్తుంది. మనం బైక్ ముందు నుంచుని వాయిస్ కమాండ్ తో బైక్ ని స్టార్ట్ చెయ్యొచ్చు. బైక్ ని ముట్టుకోకుండా మనం ఉన్న చోటుకి రమ్మంటే ఆటోమేటిక్ గా బైక్ దానంతట అదే బాలన్స్ చేసుకుని వస్తుంది. బైక్ స్టాండ్ వెయ్యకుండా కూడా దానంతట అదే బాలన్స్ అవుతుంది. బైక్ రైడర్ జేస్చర్ ఇంకా మూవ్‌మెంట్‌లకు రెస్పాండ్ అవుతుంది. రైడర్ చేతితో ఒక మూమెంట్ చేస్తే MOTOROiD కదులుతుంది లేదా ఆగిపోతుంది. ఈ ఇంటరాక్టివ్ ఫీచర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని చాలా ఈజీగా ఇంకా సరదాగా చేస్తుంది.

యమహా మోటార్‌సైకిళ్ల వారు AI యొక్క సామర్థ్యాన్ని చూపించడానికి MOTOROiD ని డెవలప్ చేశారు.. స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి మోటార్‌సైకిల్ యొక్క సేఫ్టీ, ఫంక్షనాలిటీని మెరుగుపరచడం యమహా లక్ష్యం. ఈ MOTOROiD ప్రస్తుతం ప్రోటోటైప్ లో ఉంది, అంటే ఇది టెస్టింగ్ ఇంకా షో కేస్ కోసం ఉపయోగించే మోడల్. భవిష్యత్తులో MOTOROiD వంటి బైక్‌లు చాలా నార్మల్ కావచ్చు. ఈ అధునాతన మోటార్‌ సైకిళ్లకు ఉన్న 360 డిగ్రీస్ సెన్సార్స్ ద్వారా ప్రమాదాలను నివారించడంలో బాగా ఉపయోగపడతాయి. యమహా MOTOROiD అనేది భవిష్యత్తు వైపు ఒక గొప్ప అడుగు. దీని AI-పవర్ లక్షణాలు, సెల్ఫ్-బ్యాలెన్సింగ్ సామర్థ్యం, ఇంకా రెస్పొండింగ్ ఫీచర్స్ ఎలా విప్లవాత్మకంగా మార్చగలవో చూడాలి. యమహా MOTOROiD కేవలం ఒక బైక్ కాదు, ఇది భవిష్యత్తులో మోటార్‌సైకిళ్లు ఎలా ఉండగలవో చూపగలిగే ఒక విజన్.

Show comments