పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ధర!

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర ఇకపై కూడా పెరుగుతూ పోతుందనుకున్నదానికి విరుద్ధంగా పసిడి మార్కెట్‌ నడుస్తోంది. దాదాపు 3 నెలల వ్యవధిలో ఏకంగా 2,650 రూపాయలు తగ్గింది. ఈ మధ్య కాలంలో.. బంగారం ధరల తగ్గుదలలో ఇదే ఆల్‌టైమ్‌ రికార్డు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 54,550 రూపాయలుగా ఉంది. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర కూడా బాగానే తగ్గింది. 10 గ్రాములపై ఏకంగా 110 రూపాయలు తగ్గగా.. 59,510 వద్ద ట్రేడ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రేటు రూ.100 తగ్గి.. రూ. 54,450 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.110 పతనమై రూ.59,400 మార్కు వద్ద ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు బాగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారంపై 100 రూపాయలు తగ్గగా.. 24 గ్రాముల బంగారంపై కూడా 100 రూపాయలు తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 54,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర 59,660గా ఉంది. ఇక, వెండి ధరలు కూడా గత కొంత కాలంగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌ మార్కెట్లో కేజీ సిల్వర్‌ ధర 76 వేలుగా ఉంది. అయితే, మే 5వ తేదీన కిలో వెండి ధర దాదాపు 83 వేల రూపాయలు ఉండింది. కానీ, ఈ మూడు నెలల్లో ధరలు బాగా తగ్గాయి. ఇప్పటి వరకు వెండి ధర ఏకంగా 7,700 రూపాయలు తగ్గిపోయింది. హైదరాబాద్‌ మార్కెట్‌తో పోల్చుకుంటే ఢిల్లీలో కేజీ సిల్వర్‌ ధర చాలా తక్కువగా ఉంది.

అక్కడ కిలో వెండి ధర 72,800గా ఉంది. ​కాగా, కరోనా లాక్‌డౌన్‌కు ముందు బంగారం ధర చాలా తక్కువగా ఉండేది. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధర 30 నుంచి 35 వేల రూపాయల మధ్య ట్రేడ్‌ అయ్యేది. కానీ, లాక్‌డౌన్‌ తర్వాతినుంచి బంగారం ధరలు పెరుగుతూ పోయాయి. దాదాపు 2 నెలల కాలంలో ఏకంగా పది వేల రూపాయలు పెరిగిపోయింది. ఇప్పుడు వరుసగా తగ్గుతూ వస్తోంది. మరి, గత మూడు నెలలుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments