Swetha
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులలో పేరు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ-ఇషా అంబానీల పేరిట.. మార్కెట్ లో ఎన్ని బ్రాండ్స్ రన్ అవుతున్నాయో తెలియనిది కాదు. కానీ, ఇప్పుడు వీరికి పోటీగా టాటా వారి జుడియో బ్రాండ్స్ మార్కెట్ లో ముందంజలో ఉన్నాయి. అసలు వీరు ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణాలేంటో చూసేద్దాం.
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులలో పేరు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ-ఇషా అంబానీల పేరిట.. మార్కెట్ లో ఎన్ని బ్రాండ్స్ రన్ అవుతున్నాయో తెలియనిది కాదు. కానీ, ఇప్పుడు వీరికి పోటీగా టాటా వారి జుడియో బ్రాండ్స్ మార్కెట్ లో ముందంజలో ఉన్నాయి. అసలు వీరు ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణాలేంటో చూసేద్దాం.
Swetha
ప్రస్తుతం ఉన్న అన్ని రంగాలలో.. వ్యాపార రంగం అత్యంత వేగవంతంగా దూసుకుపోతుందని చెప్పి తీరాలి. చిన్న చిన్న పట్టణాల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు.. ప్రతి ప్లేస్ లో ఎదో ఒక వ్యాపార సంబంధితమైన దుకాణాలు ఉంటూనే ఉంటున్నాయి. అయితే వ్యాపార రంగంలో రాణించే వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది.. ప్రజల అవసరాలను బట్టి కొత్త కొత్త మార్కెటింగ్ టెక్నీక్స్ ఉపయోగిస్తూ వారి వారి వ్యాపారాలను కొనసాగించాలి. అప్పుడు మాత్రమే వారికంటూ మార్కెట్ లో ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే మార్కెట్ లో క్రియేట్ అయినా బ్రాండ్ ముకేష్ అంబానీ, ఇషా అంబానీల రిలయన్స్ ట్రెండ్స్. ఈ బ్రాండ్ కు మార్కెట్ లో ఎప్పటినుంచో మంచి టాక్ ఏ ఉన్నా కూడా.. ఇప్పుడు వీరికి పోటీగా మార్కెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న బ్రాండ్ టాటా వారి జుడియో బ్రాండ్. ముఖ్యంగా యూత్ నోటా జుడియో పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అసలు జుడియో మార్కెట్ లోకి ఎలా ఎంటర్ అయిందో.. ఇప్పుడు బ్రాండ్ గా ఎలా పేరు తెచ్చుకుందో తెలిస్తే అందరు ఆశ్చర్యపోవాల్సిందే. ఈ బ్రాండ్ సక్సెస్ మంత్రా ఏంటో చూసేద్దాం.
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు.. ముఖ్యంగా యూత్ నోటా వినిపిస్తున్న పేరు జుడియో. అలాగే ఆ సంస్థ కూడా.. చిన్న చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు.. వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ విస్తరింపజేస్తుంది. దీనితో మార్కెట్ లో వీరి సంస్థ బ్రాండ్ గా క్రియేట్ అయింది. ప్రస్తుతం మార్కెట్ లో కొనసాగుతున్న వీరి విజయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇటీవల గురుగ్రామ్‌లో 22,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. అలానే, మార్చిలో ఢిల్లీలో 506వ స్టోర్‌ను ప్రారంభించింది. దీనితో వీరి వ్యాపారం రోజు రోజుకు పెరుగుతూ పోతు ఉంది. అయితే, మార్కెట్ లో జుడియో ఇంత త్వరగా అభివృద్ధి చెందడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో కనుగొన్నారు విశ్లేషకులు. అసలు విషయం ఏంటంటే.. జుడియో సంస్థ మార్కెట్ లోకి.. ఎంటర్ అయిన నాటి నుంచి.. ఎప్పటికప్పుడు మార్కెట్ అభిరుచులకు తగినట్టు అప్ డేట్ అవుతూ.. ప్రజలను ఆకర్షించడమే. దానితో పాటు.. జుడియో బ్రాండ్ కు ఉన్న బలం ఆ కంపెనీ లాజిస్టిక్స్ , ఉత్పత్తులపై పూర్తి అవగాహన కలిగి ఉండడమే. అంతే కాకుండా ప్రతి నెల కొత్త కొత్త దుస్తులను మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేసి.. యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తూ .. ఉన్న కస్టమర్స్ ను నిలబెట్టుకుంటూ కొత్త కస్టమర్స్ ను సొంతం చేసుకుంటుంది జుడియో సంస్థ.
అంతే కాకుండా.. తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడం కూడా ఈ సంస్థ ప్రత్యేకత. దీని ద్వారా ఒక రకంగా ఎక్స్ట్రా ఇన్కమ్ ను పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పి తీరాలి. కాగా, జుడియో బ్రాండ్ టాటా గ్రూప్స్ నుంచి రూపొందించబడింది. 2016లో లాంచ్ అయిన ఈ సంస్థ క్రమంగా ఇప్పుడు ఒక బ్రాండ్ గా మార్కెట్ లో స్థిరపడిపోయింది. జుడియో బ్రాండ్ ప్రతి పదిహేను రోజులకు ఆయా షాప్స్ లో.. కొత్త దుస్తులను పరిచయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఏ షాప్స్ కూడా ఇలాంటి పని తీరును కనబరచలేదని చెప్పి తీరాలి. కేవలం ఈ రకంగా చేయడం ద్వారానే.. మార్కెట్ లో ఇతర సంస్థల కంటే.. మూడు నుంచి ఐదు రెట్లు వేగంగా ఈ సంస్థ ముందంజలో ఉంటూ.. వేరే సంస్థలకు పోటీగా నిలుస్తోంది. కాబట్టి మార్కెట్ లో జుడియో సంస్థ బ్రాండ్ గా ఎదగడానికి కారణం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ.. వేగవంతమైన పని తీరును కనబరచడమే. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.