Dubai Lottery-Indian Won Rs 8 Crore: దురదృష్టం అంటే ఇతడిదే.. లాటరీలో రూ. 8కోట్లు గెలుచుకున్న భారతీయుడు.. కానీ

దురదృష్టం అంటే ఇతడిదే.. లాటరీలో రూ. 8కోట్లు గెలుచుకున్న భారతీయుడు.. కానీ

అదృష్టం తలుపు తట్టేలోపు.. దరిద్రం వచ్చి లిప్‌ లాక్‌ ఇచ్చి వెళ్లింది అని తెలుగు సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తిది కూడా సేమ్‌ ఇదే స్టోరీ. లాటరీ రూపంలో అదృష్టం అతడిని వరించింది. ఏకంగా 8 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అంత మొత్తం అంటే.. ఇక జీవితంలో సెటిల్‌ అయినట్లే. కష్టాలన్ని తీరిపోతాయి అనుకుంటాము కదా. కానీ పాపం ఇక్కడే ఆ వ్యక్తిని దురదృష్టం ఫెవికాల్‌ కన్నా బలంగా అంటుకుంది. లాటరీలో 8 కోట్లు గెలిచినా.. అతడికి లాభం లేకుండా పోయింది. కారణమేంటి అంటే..

ఓ భారతీయ వ్యక్తి దుబాయిలో నిర్వహించిన మిలియనీర్ రాఫెల్ లాటరీలో వన్ మిలియన్ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం రూ.8.22 కోట్లు. మరి ఇంతకు ఇంత భారీ జాక్‌ పాట్‌ కొట్టిన ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే సయ్యద్ అలీ బాతుషా తివంశ. లాటరీలో జాక్‌పాట్‌ కొట్టడంతో.. రాత్రికి రాత్రే కోటీశ్వరడుయ్యాడు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ టూ దగ్గర సెప్టెంబర్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో సయ్యద్ అలీని ఈ అదృష్టం వరించింది. సయ్యద్‌ అలీ ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన 4392 నెంబర్ గల లాటరీ టికెట్‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. అతడు ఏదో సరదాగా కొన్న లాటరీ టికెట్.. ఇప్పుడు అతడిని కోటీశ్వరుడిని చేసింది.

గత నెలలో తీసిన డ్రాలో సయ్యద్‌ కొన్న టికెట్‌కి లాటరీ తగలడంతో నిర్వాహకులు.. అతడిని కాంటాక్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. కానీ, అతని నెంబర్ కలవలేదు. దీంతో అతనిని కాంటాక్ట్ చేయడానికి వేరే మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకులు ఈ మేరకు తెలిపారు. ఈ వియం తెలిసిన వాళ్లు.. కరెక్ట్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చి ఉంటే బాగుండేది కదా.. ఎందుకు ఇలా చేశావు బ్రో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Show comments