Lokesh, CM Post Sharing-Janasena: CM సీటు షేరింగ్ ఉండదు.. మా నాన్నే ముఖ్యమంత్రి.. తేల్చి చెప్పిన లోకేష్

Nara Lokesh: CM సీటు షేరింగ్ ఉండదు.. మా నాన్నే ముఖ్యమంత్రి.. తేల్చి చెప్పిన లోకేష్

ముఖ్యమంత్రి పదవి అంటే నాకు వ్యతిరేకత లేదు.. అవకాశం వస్తే తప్పకుండా సీఎం అవుతానంటూ చెప్పే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి.. టీడీపీ నేత లోకేష్ భారీ షాక్ ఇచ్చారు. సీఎం సీటు షేరింగ్ లేదని తేల్చి చెప్పారు. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి పదవి అంటే నాకు వ్యతిరేకత లేదు.. అవకాశం వస్తే తప్పకుండా సీఎం అవుతానంటూ చెప్పే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి.. టీడీపీ నేత లోకేష్ భారీ షాక్ ఇచ్చారు. సీఎం సీటు షేరింగ్ లేదని తేల్చి చెప్పారు. ఆ వివరాలు..

అవకాశం వస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను.. సీఎం కుర్చీ అంటే నాకు కూడా ఇష్టమే అని సందర్భం దొరికిన ప్రతి సారి చెప్పుకొచ్చే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు.. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ భారీ షాక్ ఇచ్చాడు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి గెలిస్తే.. ముఖ్యమంత్రి అయ్యేది తన తండ్రి చంద్రబాబు నాయుడు మాత్రమే అని.. సీఎం కుర్చిలో షేరింగ్ ఉండదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సైతం దీనికి అంగీకరించారని చెప్పుకొచ్చారు. లోకేష్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా.. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే దానితో పాటుగా.. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే సీఎం పదవి షేరింగ్ పద్ధతిలో ఉంటుంది అంటూ గత కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారనే విషయమై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టతనిచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయంపైన లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

అంతేకాక జనసేనతో సీట్ల పంపకం విషయం నెల రోజుల్లో తేలిపోతుందన్నారు. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ.. తాము అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడే సీఎం అవుతారని, అందులో మరో ఆలోచన లేదని లోకేష్ స్పష్టం చేశారు. అనుభవం ఉన్న, సమర్థవంతమైన నాయకత్వం కావాలని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పారని.. అందులో ఎలాంటి సందిగ్ధం లేదని లోకేష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన రెండు కలిసి కూటమిగా ఏర్పడి.. పోటీ చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. పొత్తు గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పొత్తు ప్రకటన వెలువడిన నాటి నుంచి జనసేన కార్యకర్తలు, నాయకులు.. ఒక వేళ తమ కూటమి విజయం సాధిస్తే.. సీఎం కుర్చిని టీడీపీ, జనసేన చెరో రెండున్నరేళ్లు షేర్ చేసుకుంటాయని.. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవుతారంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ లోకేష్ ప్రకటనతో సీన్ ఒక్కసారిగా మారింది.

పైగా పవన్ కూడా సందర్భం దొరికిన ప్రతి సారి నాకు సీఎం పదవి అంటే వ్యతిరేకత లేదు.. అవకాశం వస్తే కచ్చితంగా నేను కూడా ముఖ్యమంత్రిని అవుతాననని గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. దాంతో పొత్తుల్లో భాగంగా పవన్ సీఎం కుర్చి కోసం పట్టుబడతారని భావించారు రాజకీయ విశ్లేషకులు. కానీ తాజాగా లోకేష్ వ్యాఖ్యలు చూస్తే.. పాపం పవన్ కు ఎమ్మెల్యే సీటు తప్ప ఇంకేం దక్కేది లేదని అంటున్నారు పొలిటికల్ పండితులు. తమ పార్టీ అధ్యక్షుడికి సీఎంగా అవకాశం ఇవ్వకపోతే.. తాము ఎందుకు టీడీపీ కోసం పని చేయాలి.. అదేదో ఒంటరిగా పోరాడితో అయిపోతుంది కదా అని అనుకుంటున్నారంట జనసేన కార్యకర్తలు. లోకేష్ వ్యాఖ్యలు అప్పుడే వ్యతిరేక ప్రభావం చూపడం ప్రారంభం అయ్యింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Show comments