TDP and Janasena Leaders:టీడీపీ-జ‌న‌సేన నియోజ‌క‌వ‌ర్గ స్థాయి సమావేశం రచ్చ రచ్చ!

టీడీపీ-జ‌న‌సేన నియోజ‌క‌వ‌ర్గ స్థాయి సమావేశం రచ్చ రచ్చ!

ఏపీలో జనసేన, టీడీపీ పొత్తుతో వచ్చే ఎన్నికల్లో పోటి చేయనున్నారు. ఈ క్రమంలో నియోజవర్గ స్థాయిలో ఇరు పార్టీలు రాష్ట్ర స్థాయి, నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో జనసేన, టీడీపీ పొత్తుతో వచ్చే ఎన్నికల్లో పోటి చేయనున్నారు. ఈ క్రమంలో నియోజవర్గ స్థాయిలో ఇరు పార్టీలు రాష్ట్ర స్థాయి, నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన పార్టీ పొత్తుతో ఎన్నికలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యచరణకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండు సార్లు ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలోజనసేన, టీడీపీ నేతల మధ్య సమన్వయం కుదరడంతో నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఓ పిఠాపురంలో నియోజకవర్గం స్థాయి సమావేశం రచ్చ రచ్చ జరిగింది.

2024లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జనసేన, టీడీపీ పొత్తుతో ముందుకెళ్లనున్నాయి. అయితే పొత్తు సంగతేమోగానీ, టీడీపీ, జనసేన ఎన్నికల దాకా కలిసి సాగుతాయా? అనే అనుమానులు చాలా మంది వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం.. క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల కేడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయని టాక్. అందుకే  సమన్వయం కోసం ఇరుపార్టీల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ భేటీల్లోనే గొడవలు బయటపడుతున్నాయి. తాజాగా పిఠాపురంలో నిర్వహించిన భేటీ అయితే ఏకంగా ఉద్రిక్తతకే దారి తీసింది.

తూర్పుగోదావరి పిఠాపురంలోని పాత టీడీపీ ఆఫీస్ వద్ద జరిగిన రెండు పార్టీల సమన్యయ కమీటి సమావేశం రచ్చ రచ్చ అయ్యింది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఓడిపోయిన నేపథ్యంలో.. ఈసారి సీటు తనకు ఇవ్వాలన్న నియోజకవర్గ జనసేన ఇంఛార్జి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కోరారు. ఆ సమయంలో వర్మ కలుగజేసుకుని.. మహామహులే గత ఎన్నికల్లో ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారని సమాచారం. దీంతో పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించే వర్మ వ్యాఖ్యానించారని తెలుస్తోంది. తమ అధినేతను వర్మ అవమానించారని జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన, టీడీపీ నేతల పరస్పర దూషణలకు దిగ్గారు.

అంతేకాక గలాటతో కుర్చీలు, బెంచీలను పడేయడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించిందని స్థానికులు తెలిపారు. చివరకు ఇరు పార్టీల నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా ఫలించలేదంట.  రెండు పార్టీల వాళ్ల మాటలు పట్టించుకోకుండా కార్యకర్తలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. మరి.. ఇలా జనసేన, టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఫలించవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments