T20 World Cup 2024 Kulcha Combination: టీ20 వరల్డ్ కప్ టీమ్​లో అదిరిపోయే కాంబినేషన్! అన్ని జట్లకు వణుకు పుట్టాల్సిందే!

టీ20 వరల్డ్ కప్ టీమ్​లో అదిరిపోయే కాంబినేషన్! అన్ని జట్లకు వణుకు పుట్టాల్సిందే!

టీ20 వరల్డ్ కప్ టీమ్​ను భారత క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. అయితే ఈసారి జట్టులో అదిరిపోయే ఓ కాంబినేషన్​ను సెట్ చేసింది. ఆ కాంబో క్లిక్ అయితే అన్ని టీమ్స్​కూ వణుకు పుట్టాల్సిందే.

టీ20 వరల్డ్ కప్ టీమ్​ను భారత క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. అయితే ఈసారి జట్టులో అదిరిపోయే ఓ కాంబినేషన్​ను సెట్ చేసింది. ఆ కాంబో క్లిక్ అయితే అన్ని టీమ్స్​కూ వణుకు పుట్టాల్సిందే.

టీ20 వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్​మెంట్ గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఆ ప్లేయర్​కు జట్టులో చోటు లేదట, ఈ క్రికెటర్ టీమ్​లోకి ఎంట్రీ ఇస్తున్నాడట అంటూ ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాతో పాటు బయట కూడా క్రికెట్ ఫ్యాన్స్ భారత ప్రపంచ కప్ జట్టు ఎంపిక గురించి భారీగా డిస్కస్ చేస్తూ వచ్చారు. అయితే మొత్తానికి ఇవాళ టీమ్​ను అధికారికంగా ప్రకటంచింది భారత క్రికెట్ బోర్డు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల బృందం 15 మంది సభ్యులతో కూడిన వరల్డ్ కప్ స్క్వాడ్​ను అనౌన్స్ చేసింది. అయితే ఇందులో ఓ కాంబినేషన్​ను సెట్ చేసిన విధానం హైలైట్ అనే చెప్పాలి.

వన్డే వరల్డ్ కప్-2023 తృటిలో మిస్సవడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ హార్ట్స్ ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయి. దీంతో టీ20 ప్రపంచ కప్ అయినా టీమిండియా నెగ్గాలని అంతా కోరుకుంటున్నారు. ఈ తరుణంలో పొట్టి కప్పుకు గట్టిగా ప్లాన్ చేసిన బీసీసీఐ.. ఓ అదిరిపోయే కాంబినేషన్​ను సెట్ చేసింది. వాళ్లిద్దరూ కలసి బరిలోకి దిగితే ఇక ఎంతటి ప్రత్యర్థికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. వాళ్లిద్దరి బౌలింగ్​కు మహా మహా బ్యాటర్లు కూడా తలొగ్గాల్సిందే. ఆ కాంబినేషన్ పేరే ‘కుల్చా’. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ పేర్లను కలిపి పెట్టిందే ఇది. టీ20 వరల్డ్ కప్ కోసం ఈ తోపు స్పిన్నర్లను టీమ్​లోకి తీసుకుంది బీసీసీఐ.

గాయం తర్వాత కమ్​బ్యాక్​లో అదరగొడుతున్న కుల్దీప్.. గతేడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే ప్రపంచ కప్​లోనూ దుమ్మురేపాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్, ఆఫ్ఘానిస్థాన్ సిరీస్, ఇంగ్లండ్​ సిరీస్​ల్లోనూ భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్​లోనూ అతడు సూపర్ ఫామ్​లో ఉన్నాడు. అలాంటోడికి జతగా ఇప్పుడు సీనియర్ స్పిన్నర్ చాహల్​ను జట్టులోకి తీసుకున్నారు. ఎంతో ఎక్స్​పీరియెన్స్ కలిగిన చాహల్ ఏ పిచ్, ఏ టీమ్​తో ఆడుతున్నామనే దాన్ని బట్టి తన టాక్టిక్స్​ను మార్చుకొని బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు. ఈ ఐపీఎల్​లో 13 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. అలాంటి కుల్దీప్-చాహల్ ఇద్దరూ కలిస్తే ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే. వికెట్లు తీయడంతో పాటు పరుగులు కట్టడి చేయడంలోనూ వీళ్లిద్దరూ ఎక్స్​పర్ట్స్. అందుకే వరల్డ్ కప్ కోసం తిరిగి ఈ జోడీనే నమ్ముకుంది బోర్డు. ఒకవేళ వీళ్లిద్దరూ గనుక క్లిక్ అయితే మాత్రం టీ20 కప్పు మనదేనని అభిమానులు అంటున్నారు.

Show comments