Rinku Singh Selection Ajit Agarkar Reaction: వరల్డ్ కప్ మెయిన్ టీమ్​లో రింకూకు దక్కని ఛాన్స్.. రీజన్ ఏంటో చెప్పిన అగార్కర్!

వరల్డ్ కప్ మెయిన్ టీమ్​లో రింకూకు దక్కని ఛాన్స్.. రీజన్ ఏంటో చెప్పిన అగార్కర్!

భారత టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​లో రింకూ సింగ్​కు చోటు దక్కని సంగతి తెలిసిందే. మెయిన్ టీమ్​లోకి అతడ్ని తీసుకోలేదు. రిజర్వ్​డ్ ప్లేయర్​గా యూఎస్​ఏకు వెళ్లనున్నాడు రింకూ. అతడి సెలెక్షన్​పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రియాక్ట్ అయ్యాడు.

భారత టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​లో రింకూ సింగ్​కు చోటు దక్కని సంగతి తెలిసిందే. మెయిన్ టీమ్​లోకి అతడ్ని తీసుకోలేదు. రిజర్వ్​డ్ ప్లేయర్​గా యూఎస్​ఏకు వెళ్లనున్నాడు రింకూ. అతడి సెలెక్షన్​పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రియాక్ట్ అయ్యాడు.

టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్స్​ను దాదాపుగా అన్ని జట్లు ప్రకటించేశాయి. టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బిగ్ టీమ్స్ తమ జట్ల గురించి ప్రకటన చేసేశాయి. వీటితో పాటు ఆఫ్ఘానిస్థాన్ కూడా స్క్వాడ్ గురించి అనౌన్స్​మెంట్ చేసింది. అయితే వీటన్నింటి కంటే కూడా భారత జట్టు సెలెక్షన్ గురించి ఇప్పుడు జోరుగా చర్చలు నడుస్తున్నాయి. టీమ్​లోకి కొందరు స్టార్లకు చోటు దక్కకపోవడమే దీనికి కారణం. కేఎల్ రాహుల్​తో పాటు రింకూ సింగ్​ లాంటి రెగ్యులర్ ప్లేయర్లకు వరల్డ్ కప్ స్క్వాడ్​లో బెర్త్ లభించకపోవడంతో అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా రింకూను ఎందుకు తీసుకోలేదంటూ నెట్టింట కూడా డిస్కషన్స్ ఊపందుకున్నాయి.

ఇటీవల కాలంలో భారత టీ20 జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు రింకూ సింగ్. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘానిస్థాన్ జట్లతో జరిగిన టీ20 సిరీస్​ల్లో టీమిండియా విజయాల్లో అతడి పాత్ర చాలా ఉంది. ఆఖర్లో బ్యాటింగ్​కు వస్తూ ధనాధన్ షాట్లతో మ్యాచ్​ను ఫినిష్ చేయడంలో అతడు ఆరితేరాడు. ఎంతో ఫిట్​గా ఉండే ఈ పించ్ హిట్టర్​ బ్యాటింగ్​తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్​తోనూ ఆకట్టుకుంటున్నాడు. అలాంటోడ్ని టీ20 వరల్డ్ కప్ మెయిన్ టీమ్​లోకి తీసుకోలేదు. రిజర్వ్​డ్ ఆటగాడిగా యూఎస్​ఏ-వెస్టిండీస్​కు పయనం కానున్నాడు రింకూ. ఈ టాలెంటెడ్ యంగ్​స్టర్​కు జట్టులో ఎందుకు చోటు దక్కలేదో వివరణ ఇచ్చాడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. రింకూను టీమ్​లోకి తీసుకోవాలనే అనుకున్నామని.. కానీ పలు కారణాల వల్ల కుదరలేదని తెలిపాడు.

వరల్డ్ కప్ స్క్వాడ్ సెలెక్షన్ మీద బీసీసీఐ నిర్వహించిన ప్రెస్​మీట్​లో అగార్కర్​తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రింకూ ఎంపిక గురించి జర్నలిస్టులు అడగ్గా అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. ‘వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపికలో అత్యంత కఠిన నిర్ణయం అంటే రింకూ సింగ్​దేనని చెప్పాలి. రింకూ బాగా ఆడుతున్నాడు. అయినా జట్టులోకి తీసుకోలేకపోయాం. వెస్టిండీస్​లో స్లో పిచ్​లు ఉంటాయనేది తెలిసిందే. అక్కడి వికెట్లకు తగ్గట్లు ఎక్స్​ట్రా స్పిన్ ఆప్షన్స్ కావాలని భావించాం. రోహిత్ చేతిలో ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను పెట్టాలనేది మా ప్లాన్. అందుకే రింకూ ప్లేస్​లో అదనపు స్పిన్నర్​ను తీసుకున్నాం’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. కేఎల్ రాహుల్​ సెలెక్షన్ గురించి చెబుతూ.. అతడు టాపార్డర్ బ్యాటర్ అని, టీమ్ కాంబినేషన్​కు తగ్గట్లు మిడిలార్డర్​లో ఆడేవాళ్లు కావాలని.. అందుకే ఆ స్థానంలో సంజూ శాంసన్​కు ఛాన్స్ ఇచ్చామని పేర్కొన్నాడు.

Show comments