సెట్ కాబోతున్న స్వీట్ కాంబినేషన్

సెట్ కాబోతున్న స్వీట్ కాంబినేషన్

ఇద్దరూ సీనియర్ హీరోయిన్లే. దశాబ్దం పైగా కెరీర్ ని ఎంజాయ్ చేసి ఇప్పటికీ అవకాశాలు రాబట్టుకుంటున్న వాళ్ళు. పైగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది. త్వరలో ఆ ఛాన్స్ ఉందని చెన్నై టాక్. వాళ్ళే అనుష్క, త్రిష. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందబోయే లవ్ యాక్షన్ డ్రామాలో ఈ ఇద్దరినే ఎంచుకున్నట్టు తెలిసింది. తొలుత ఇది అజిత్ తో గతంలో తీసిన ఎన్నై అరిందాల్(తెలుగులో ఎంతవాడుగాని)కు సీక్వెల్ అనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు తీయబోయేది ఫ్రెష్ సబ్జెక్ట్ అని తెలిసింది.

ఇటీవలి కాలంలో గౌతమ్ మీనన్ కు అంతగా సక్సెస్ లు లేవు. ధనుష్ తో ఎప్పుడో తీసిన నోటా రెండు భాషల్లోనూ తిరస్కారానికి గురయ్యింది. ఏ మాయ చేశావే తర్వాత ఆ స్థాయిలో మాయ చేయలేకపోయిన గౌతమ్ ఇప్పుడు చాలా సీరియస్ గా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారట. విక్రమ్ తో తీస్తున్న ధృవ నక్షత్రం ఏళ్ళుగా సాగుతూనే ఉంది తప్ప విడుదల కావడం లేదు. మరో సినిమా జాషువా కూడా పెండింగ్ లో పడిపోయింది. ఇప్పటి సంగతి విషయానికి వస్తే అనుష్క-త్రిషల కాంబినేషన్ కొత్త కాదు. గతంలో ఎంతవాడుగాని లో నటించారు కానీ కాంబినేషన్ సీన్లు ఉండవు. త్రిష ఫ్లాష్ బ్యాక్ లోనే చనిపోతే అనుష్క తర్వాత ఎంట్రీ ఇస్తుంది.

నాగార్జున కింగ్ లో త్రిష హీరోయిన్ కాగా అనుష్క జస్ట్ ఒక స్పెషల్ సాంగ్ లో అలా తళుక్కున మెరిసి మాయమైపోతుంది. అంతే తప్ప ఈ ఇద్దరూ కలిసి ఫుల్ లెన్త్ స్క్రీన్ పంచుకున్న చిత్రం అయితే లేదు. మరి గౌతమ్ మీనన్ ప్లానింగ్ ఏంటో తెలియదు. ఈయనైనా వీళ్లిద్దరిని కలుపుతాడో లేదో చూడాలి. అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం విడుదల కోసం వెయిట్ చేస్తుండగా త్రిష మాత్రం నాలుగు తమిళ సినిమాలు, ఒక మలయాళం మూవీతో యమా బిజీగా ఉంది. మా=మణిరత్నం భారీ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వం కోసమే మెగాస్టార్ ఆచార్యను వదులుకున్న త్రిష తనకు పెద్ద బ్రేక్ ఇచ్చిన గౌతమ్ కి ఎస్ చెబుతుందో లేదో వేచి చూడాలి.

Show comments