Rapido, Uber: ర్యాపిడో, ఉబర్ లకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

Rapido, Uber: ర్యాపిడో, ఉబర్ లకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

  • Author Soma Sekhar Updated - 03:13 PM, Tue - 19 December 23

అయితే తాజాగా సమగ్ర లైసెన్స్ విధానం లేకుండా బైక్ సర్వీసులు నడపడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. దాంతో గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రముఖ బైక్, ట్యాక్సీ సర్వీస్ సంస్థలు అయిన ర్యాపిడో, ఉబర్ లకు ఊహించని షాక్ తగిలింది. గతంలో ఈ రెండు కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు అనుకూలంగా ఉత్తర్వులను ఇచ్చింది. అయితే తాజాగా సమగ్ర లైసెన్స్ విధానం లేకుండా బైక్ సర్వీసులు నడపడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. దాంతో గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఉబర్, ర్యాపిడో సంస్థలు మోటార్ వాహనాల చట్టం-1988ను ఉల్లంఘిస్తున్నాయని గత ఫిబ్రవరిలో ఈ సేవలను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధంపై సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. బైక్, ట్యాక్సీలను నడుపుకోవడానికి అనుమతిస్తూ.. గత నెల 26న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఈ ఉత్తర్వులపై సోమవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. ఢిల్లీ ప్రభుత్వం జులై చివరి నాటికి కొత్త వాహన విధానాన్ని తీసుకోస్తామన్న వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. దాంతో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పరిణామంతో ఉబర్, ర్యాపిడో సంస్థలు ఒక్కసారిగా కంగుతిన్నాయి.

Show comments