Payal Rajput: నాకు న్యాయం చేయండి.. ఆ పని చేయమని వేధిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్

నాకు న్యాయం చేయండి.. ఆ పని చేయమని వేధిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్

నాకు న్యాయం చేయండి.. ఆ పని చేయమంటూ వేధిస్తున్నారు అంటూ పాయల్ రాజ్ పుత్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు అభిమానులు, సినిమా పెద్దలు అండగా నిలబడాలని కోరింది. అసలేం జరిగిందంటే?

నాకు న్యాయం చేయండి.. ఆ పని చేయమంటూ వేధిస్తున్నారు అంటూ పాయల్ రాజ్ పుత్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు అభిమానులు, సినిమా పెద్దలు అండగా నిలబడాలని కోరింది. అసలేం జరిగిందంటే?

ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాయల్ రాజ్ పుత్.. ఓవర్ నైట్ లో క్రేజ్ అయితే వచ్చింది గానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్లు పడడం లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ తో చేసిన మంగళవారం సినిమాతోనే హిట్ కొట్టింది. దీంతో ఈ బ్యూటీ ఫుల్ జోష్ లో ఉంది. కాగా ప్రభాస్ పెట్టిన ఓ పోస్ట్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. తన లైఫ్ లోకి ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టగా అది రెండు రోజులు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. మరోవైపు పాయల్ రాజ్ పుత్ కూడా ఒక ట్వీట్ చేసింది. ‘నేను ఏదో ఒక వ్యక్తికి డార్లింగ్ ని. గెస్ చేయండి’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో డార్లింగ్ ప్రభాస్ కి, పాయల్ రాజ్ పుత్ కి పెళ్లంటూ కథనాలు ప్రచారం చేశారు. అయితే ప్రభాస్ అసలు విషయం బయట పెట్టేసరికి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. పాయల్ పెట్టిన ట్వీట్ కి, ప్రభాస్ కి సంబంధం లేదని తేలిపోయింది. ఇదిలా ఉంటే తనకు న్యాయం చేయాలంటూ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ షేర్ చేసింది పాయల్. 

2019-20 ఏడాది సమయంలో రక్షణ అనే సినిమా ఒప్పుకున్నానని.. అయితే ఆ సినిమాకి ముందు 5Ws అనే టైటిల్ అనుకున్నారని తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చిందని.. కానీ ఇటీవల తనకు సక్సెస్ రావడంతో ఆ క్రేజ్ ని వాడుకుని మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని పేర్కొంది. కానీ ఒప్పందం ప్రకారం తనకు చెల్లించాల్సిన పారితోషికం ఇంకా ఇవ్వలేదని.. మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం తాను అందుబాటులో లేనని.. నా టీమ్ ఆ మూవీ యూనిట్ ను సంప్రదించిందని తెలిపింది. తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వాలని టీమ్ వారిని అడిగిందని.. కానీ వాళ్ళు  మాత్రం డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారని చెప్పుకొచ్చింది.

పైగా సినిమా ప్రమోషన్ కి రావాలని.. లేదంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. అయితే తన ప్రమేయం లేకుండా ఆ మూవీలో తన పేరు, పాత్ర ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపింది. ఇటీవల జరిగిన మీటింగుల్లో కూడా తప్పుడు మాటలు మాట్లాడారని తెలిపింది. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్స్ పాయల్ కి మద్దతుగా నిలిచారు. పాయల్ కి అన్యాయం చేసిన వారిపై లీగల్ గా చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాయల్ రాజ్ పుత్ రక్షణ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనాలంటూ చిత్ర బృందం ఆమెను వేధిస్తున్నట్లు పేర్కొంది.

Show comments