షూ కొనేందుకు డబ్బుల్లేవ్.. అతనే ఆదుకున్నాడు! శార్దూల్ ఎమోషనల్

షూ కొనేందుకు డబ్బుల్లేవ్.. అతనే ఆదుకున్నాడు! శార్దూల్ ఎమోషనల్

రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో విధర్భపై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్. అనంతరం మాట్లాడిన అతడు కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలను చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆ టైమ్ లో అతడే ఆదుకున్నాడని చెప్పుకొచ్చాడు. మరి శార్దూల్ ను కష్ట సమయంలో ఆదుకున్న ప్లేయర్ ఎవరు?

రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో విధర్భపై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్. అనంతరం మాట్లాడిన అతడు కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలను చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆ టైమ్ లో అతడే ఆదుకున్నాడని చెప్పుకొచ్చాడు. మరి శార్దూల్ ను కష్ట సమయంలో ఆదుకున్న ప్లేయర్ ఎవరు?

రంజీ ట్రోఫీ 2024 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ముంబై వర్సెస్ విధర్భ జట్లు టైటిల్ కోసం పోరాడుతున్నాయి. ఆదివారం ప్రారంభం అయిన ఈ మ్యాచ్ లో తొలిరోజు విధర్భ బౌలర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ముంబై 224 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది అంటే అది స్టార్ ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ పుణ్యమే. తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిన అతడు కేవలం 37 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత శార్దూల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

సెలబ్రిటీ అనగానే అందరికి రిచ్ లైఫే గుర్తుకు వస్తుంది. కానీ ఈ రేంజ్ కు వారు రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చాలా మందికి తెలీదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే తమ కష్టాలను ప్రపంచానికి తెలియజేస్తుంటారు. తాజాగా తన లైఫ్ లో తాను అనుభవించిన కష్టాలను చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్, ముంబై ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ లో ముంబై వర్సెస్ విధర్భ టీమ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో తొలిరోజు బ్యాటింగ్ తో దుమ్మురేపాడు శార్దూల్. 111 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 37 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన అతడు ఓవరాల్ గా 69 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 3 సిక్సులతో 75 రన్స్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ముంబై 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన విధర్భ టీమ్ ను ధవళ్ కులకర్ణి దెబ్బకొట్టాడు. తొలిరోజు ఆటముగిసే సమయానికి విధర్భ 3 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత 35 ఏళ్ల కులకర్ణి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేశాడు. దీంతో అతడికి గాడ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించింది టీమ్. ఈ నేపథ్యంలో కులకర్ణితో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు శార్ధూల్ ఠాకూర్.

“నా కెరీర్ ఆరంభంలో నేను ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ టైమ్ లో నాకు అండగా నిలబడ్డాడు కులకర్ణి. చిన్ననాటి నుంచే అతడి గేమ్ ను గమనిస్తున్నాను. బౌలింగ్ లో నాకు ఎన్నో మెళకువలు నేర్పాడు. అంతేకాకుండా.. షూ కొనడానికి నా దగ్గర డబ్బులేకుంటే అతడి బూట్ల జతను నాకు ఇచ్చాడు. మంచి మనసున్న వ్యక్తి” అంటూ కులకర్ణితో ఉన్న అనుబంధం గురించి వివరిస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. మరి ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ.. చేసిన సాయన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఎమోషనల్ అయిన శార్దూల్ ఠాకూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రోహిత్ శర్మ CSKకి నాయకత్వం వహించాలి.. రాయుడు కామెంట్స్ వెనక కారణమేంటి?

Show comments