Shaitaan: అజయ్ దేవగణ్ థ్రిల్లర్ కు సీక్వెల్?

Shaitaan: అజయ్ దేవగణ్ థ్రిల్లర్ కు సీక్వెల్?

బాలీవుడ్ లో ఈ సంవత్సరం అతి కొద్ది పెద్ద హిట్ లలో ఒకటిగా అజయ్ దేవగణ్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సైతాన్ సినిమా నిలిచింది.కాగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని ఏరియాల్లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణెల ఫైటర్ నెలకొల్పిన రికార్డులను కూడా ఈ సినిమా క్రాస్ చేసింది.

బాలీవుడ్ లో ఈ సంవత్సరం అతి కొద్ది పెద్ద హిట్ లలో ఒకటిగా అజయ్ దేవగణ్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సైతాన్ సినిమా నిలిచింది.కాగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని ఏరియాల్లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణెల ఫైటర్ నెలకొల్పిన రికార్డులను కూడా ఈ సినిమా క్రాస్ చేసింది.

బాలీవుడ్ లో ఈ సంవత్సరం అతి కొద్ది పెద్ద హిట్ లలో ఒకటిగా అజయ్ దేవగణ్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సైతాన్ సినిమా నిలిచింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇంకా మంచి ప్రదర్శన ఇస్తుంది. కాగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని ఏరియాల్లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణెల ఫైటర్ నెలకొల్పిన రికార్డులను కూడా ఈ సినిమా క్రాస్ చేసింది. సైతాన్ సినిమా భారీ విజయం సాధించడంతో నిర్మాతలు ఇప్పుడు ఈ సినిమాని ఫ్రాంచైజీగా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వినికిడి.

సైతాన్ సినిమా సీక్వెల్ కొద్ది రోజుల్లో ప్రకటించబడుతుందని అంటున్నారు. దర్శకుడు వికాస్ బహ్ల్ తన చిత్రానికి వచ్చిన స్పందనతో సంతోషంగా ఉన్నారట. అందువల్ల, చిత్ర బృందం కూడా సీక్వెల్ తీయటానికి ఉత్సాహంగా ఉన్నారట. అధిక అంచనాలను కలిగి ఉన్నారు. ఈ చిత్రంలో కూడా మొదటి భాగంలో ఉన్న తారాగణం, అంటే అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, జ్యోతికలతో పాటు జాంకీ బోడివాలా నటిస్తారని అంటున్నారు. సైతాన్ 2 త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రేజీ సీక్వెల్‌ కు సంభందించిన ప్రకటన మేకర్స్ నుంచి రావచ్చని అంటున్నారు. ఈసారి హీరో కుటుంబంతో బ్లాక్ మ్యాజిక్ అనే సమస్యతో పాటు మరిన్ని అంశాలను జోడించాలని చూస్తున్నారట. అంటే అజయ్ తండ్రిగా, జ్యోతిక తల్లిగా, జాంకీ బోడివాలా కూతురిగా కనిపించనుండగా, మాధవన్ తాంత్రికుడిగా మరోసారి నటించనున్నారు.

మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సైతాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ 200 కోట్ల గ్రాస్ దిశగా ఈ సినిమా దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాలో అందరి నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా విలన్ పాత్రలో నటించిన మాధవన్ ను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. అలాగే ఆయన చేత భాదింపబడే అమ్మాయిగా జాంకీ బోడివాలా కూడా చక్కగా నటించారని అందరూ ప్రశంసించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయిన గుజరాతీ సినిమా ” వష్ ” సినిమాలో కూడా జాంకీనే హీరో కూతురి పాత్రలో నటించారు. మరి సైతాన్ సినిమాకు నిజంగానే సీక్వెల్ ను ప్రకటిస్తే, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Show comments